Begin typing your search above and press return to search.

రెడీ! బ్రహ్మోత్సవం మోషన్‌ పోస్టర్‌ కమింగ్‌

By:  Tupaki Desk   |   27 April 2016 5:51 PM GMT
రెడీ! బ్రహ్మోత్సవం మోషన్‌ పోస్టర్‌ కమింగ్‌
X
ఈ మధ్య ప్రచారంలో చాలా రకాల కాన్సెప్టులు వచ్చాయి. ప్రతీదీ పక్కాగా ఫాలో అయిపోవాల్సి వస్తోంది. ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ - టీజర్ - ప్రోమో - ట్రైలర్ - ఆడియో - సాంగ్ ప్రోమో.. ఇలా అంతా ఓ షెడ్యూల్ అయిపోయింది. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుతో బ్రహ్మోత్సవం తీస్తున్న నిర్మాతలు.. ఇప్పుడు మోషన్ పోస్టర్ విడుదల చేస్తున్నామంటూ అనౌన్స్ చేసింది.

'రేపే బ్రహ్మోత్సవం చిత్రానికి ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ ని విడుదల చేయబోతున్నాం. ఎక్స్ క్లూజివ్ పోస్టర్ రేపు ఉదయం మీకోసం.' అంటూ ఈ సినిమా యూనిట్ చేసిన ట్వీట్ అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. దీనికి కారణం.. ఇప్పటికే సినిమాకి సంబంధించి చాలా వర్క్ కంప్లీట్ అయిపోయింది. ఆడియో, మూవీ కూడా దాదాపు విడుదలకు రెడీ అయిపోయాయి. ఇన్నాళ్లూ ఫస్ట్ లుక్ తర్వాత మోషన్ పోస్టర్ ఇవ్వడం అలవాటు.

కానీ బ్రహ్మోత్సవం యూనిట్ సంగతి విచిత్రంగా ఉంది. అప్పుడెప్పుడో న్యూ ఇయర్ రోజునే టీజర్ రిలీజ్ చేసిన చిత్రానికి.. ఇప్పుడు ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ ఏంటో అర్ధంకాక.. చాలా మంది బుర్ర బద్దలు కొట్టుకుంటున్నారు. అయితే.. ఇప్పటివరకూ తాము మోషన్ పోస్టర్ ఇవ్వలేదు కాబట్టి.. ఇప్పుడు విడుదల చేస్తున్నట్లు చెబుతోంది యూనిట్. ఈ ఆన్సర్ మరీ విచిత్రంగా ఉంది కదూ.