Begin typing your search above and press return to search.

బ్రహ్మోత్సవం.. మళ్లీ వాయిదా అంటున్నారు

By:  Tupaki Desk   |   27 April 2016 7:30 PM GMT
బ్రహ్మోత్సవం.. మళ్లీ వాయిదా అంటున్నారు
X
అరడజన్ పోస్ట్ పోన్ ల తరువాత.. ఇక ఇదే ఫిక్స్.. ఇకపై వాయిదాలు ఉండవ్.. అంటూ అనౌన్స్ మెంట్ ఇచ్చాక కూడా.. మరోసారి వాయిదా వేసిన రికార్డ్ సృష్టిస్తోంది బ్రహ్మోత్సవం. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ఈ సినిమా కోసం.. ఇండస్ట్రీ తోపాటు అభిమానులు చాలా ఆత్రంగా ఎదురుచూస్తున్నారు. సమ్మర్ లో వచ్చే హైఎండ్ ఫ్యామిలీ మూవీ కావడంతో.. బోలెడంత క్యూరియాసిటీ నెలకొంది.

కానీ జనాల ఆసక్తిని, అభిమానుల ఆతృతను.. బ్రహ్మోత్సవం యూనిట్ ఎప్పటికప్పుడు నీరు గారుస్తూనే ఉంది. మే 6న ఆడియో విడుదల అంటూ వీర లెవెల్ లో ప్రకటించేసి.. ఇప్పుడు మళ్లీ ఒక రోజు పోస్ట్ పోన్ అంటున్నారు. తిరుపతి నుంచి వెన్యూను హైద్రాబాద్ మార్చిన బ్రహ్మోత్సవం టీం.. ఇక్కడ కూడా అంత పక్కా డేట్ సెట్ చేసుకోలేకపోతున్నారు.

ఒక ఆడియో విషయంలోనే కాదు.. రిలీజ్ పై కూడా ఇదే కన్ఫ్యూజన్. మే 20.. ఈ డేట్ ఇక మారదు అనే పొజిషన్ నుంచి.. మే 20 కానీ, మే 27 కానీ.. అని నసిగే సిట్యుయేషన్ వచ్చేసింది. ఇదంతా గమనిస్తున్న అభిమానులకు మాత్రం గందరగోళం ఎక్కువయిపోతోంది. అసలు బ్రహ్మోత్సవంకు ఎందుకు ఇన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయో మాత్రం ఎవరికీ అర్ధం కావడం లేదు.