Begin typing your search above and press return to search.

ఫ్యామిలీస్.. మహేష్ బంపర్ ఆఫర్

By:  Tupaki Desk   |   18 Dec 2015 4:05 AM GMT
ఫ్యామిలీస్.. మహేష్ బంపర్ ఆఫర్
X
సూపర్ స్టార్ మహేష్ బాబుతో కలిసి నటించే ఛాన్స్ వస్తే? ఊహకే సూపర్ గా అనిపిస్తోంది కదూ.. అలాంటిది మీ ఫ్యామిలీ మొత్తం మహేష్ బాబు సినిమాలో కలిసి కనిపిస్తే ఎలా ఉంటుంది? కేకలు పెట్టి ఎగిరి గంతేయాలని అనిపించదూ.

వింతగా అనిపిస్తున్నా ఇది నిజమే. మహేష్ లేటెస్ట్ మూవీలో కనిపించేందుకు, కలిసి నటించేందుకు బంపర్ ఆఫర్ ఇచ్చేశారు. అది కూడా ఇప్పుడు షూటింగ్ జరుపుకుంటున్న బ్రహ్మోత్సవం మూవీ కోసమే. ఈ సినిమా కోసం ఫ్యామిలీస్ కి ఓ అద్భుతమైన ప్రకటించారు. ఎవరైనా సరే కుటుంబాలు షూటింగ్ తోపాటు మూవీలోను భాగం కావచ్చని చెబ్తోంది యూనిట్. దీనికి వయసుతో కూడా ఎటువంటి సంబంధం లేదు. ఎవరైనా అప్లై చేసుకోవచ్చని యూనిట్ వర్గాలు ప్రకటించాయి. దీనికి చేయాల్సిందల్లా కుటుంబ సభ్యులందరూ కలిసి ఉన్న రెండు ఫోటలను, కాంటాక్ట్ డీటైల్స్ తో కలిపి పంపితే సరిపోతుంది.

డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల కుటుంబ కథా చిత్రాన్ని రియలిస్టిక్ గా తెరకెక్కించేందుకే.. ఈ కాస్టింగ్ కాల్ ఇచ్చాడని తెలుస్తోంది. అయితే.. తమ మువీని డిఫరెంట్ గా పబ్లిసిటీ చేసుకోవడంలో పీవీపీ బ్యానర్ కి మంచి ఎక్స్ పీరియన్స్ ఉంది. వినూత్నమైన ప్రచారంతో సినిమాని జనాల్లోకి తీసుకెళుతుంటారు. అందులో భాగంగానే ఇప్పుడు బ్రహ్మోత్సవంలో కనిపించే ఆఫర్ ఇచ్చారని చెప్పచ్చు.