Begin typing your search above and press return to search.

బ్రహ్మోత్సవం.. మేడే నుంచే పండగ స్టార్ట్

By:  Tupaki Desk   |   1 May 2016 4:13 AM GMT
బ్రహ్మోత్సవం.. మేడే నుంచే పండగ స్టార్ట్
X
ఎలాంటి భారీ సినిమాకైనా ఇప్పుడు పబ్లిసిటీ చాలా అవసరం. ఈ విషయంలో టాలీవుడ్ లో అందరికంటే నాలుగు అడుగులు ముందే ఉంటాడు సూపర్ స్టార్ మహేష్ బాబు. ప్రిన్స్ లేటెస్ట్ మూవీ బ్రహ్మోత్సవంకు ఇంకా ఆడియో ఫంక్షన్ కూడా జరక్కపోయినా.. మే నెలలోనే విడుదల ఖాయమంటున్నారు. అందుకే మే 1నుంచి ప్రచార జోరు మొదలైపోనుంది.

టీవీ ఛానల్స్ లో ప్రమోషన్స్, 'మధురం మధురం'అనే సాంగ్ ప్రోమోతో పాటు.. వెబ్ సైట్స్ లో ల్యాండింగ్ పేజ్ ను బ్రహ్మోత్సవం యాడ్స్ తో నింపేయడం వరకూ.. రకరకాల ప్రమోషనల్ యాక్టివిటీస్ ప్లాన్ చేశారని తెలుస్తోంది. ఇప్పటివరకూ టాలీవుడ్ చూడనంత రేంజ్ లో పబ్లిసిటీ కార్యకలాపాలు ప్లాన్ చేశారని అంటున్నారు. మహేష్ తన సినిమాను చాలా అగ్రెసివ్ గా ప్రచారం గతంలో శ్రీమంతుడు విషయంలో చూశాం కానీ.. ఇప్పుడు మరింత దూకుడు ప్రదర్శిస్తాడని తెలుస్తోంది.

మే 7న బ్రహ్మోత్సవం ఆడియో విడుదల కానుండగా.. ఇప్పటికైతే మే 27న బ్రహ్మోత్సవం మూవీని రిలీజ్ చేస్తారని తెలుస్తోంది. అంటే.. మే 1నుంచి కౌంట్ చేస్తే దాదాపు నాలుగు వారాలు పబ్లిసిటీ కోసం కేటాయించనున్నారన్న మాట. ఓ తెలుగు సినిమాకి ఇదే హైయెస్ట్ పబ్లిసిటీ ప్లానింగ్ అని చెప్పాల్సిందే.