Begin typing your search above and press return to search.

ఫస్ట్ లుక్: 'బ్రహ్మాస్త్రం' లో పవర్ ఫుల్ 'గురు' అవతార్ లో అమితాబ్..!

By:  Tupaki Desk   |   9 Jun 2022 11:13 AM GMT
ఫస్ట్ లుక్: బ్రహ్మాస్త్రం లో పవర్ ఫుల్ గురు అవతార్ లో అమితాబ్..!
X
బాలీవుడ్ లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం ''బ్రహ్మాస్త్ర''. మూడు భాగాలుగా రానున్న ఈ సినిమాకి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో రణబీర్ కపూర్ - అమితాబ్ బచ్చన్ - అక్కినేని నాగార్జున - ఆలియాభట్ - మౌనీ రాయ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.

'బ్రహ్మాస్త్ర' నుంచి ఇప్పటికే విడుదలైన రణబీర్ - అలియా ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. అలానే ఇటీవల వచ్చిన ట్రైలర్ గ్లింప్స్ ప్రేక్షకులకు విజువల్ ట్రీట్ ఇచ్చింది. జూన్ 15న థియేట్రికల్ ట్రైలర్ ను లాంచ్ చేయనున్న నేపథ్యంలో.. అంతకంటే ముందుగా ఈరోజు గురువారం మేకర్స్ అమితాబ్ బచ్చన్ ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ ను ఆవిష్కరించారు.

ప్రభాస్త్ర: కాంతి కత్తిని కలిగి ఉన్న తెలివైన నాయకుడుగా.. 'గురు' గా అమితాబ్ ను పరిచయం చేసారు. పోస్టర్‌ ను నిశితంగా పరిశీలిస్తే.. బిగ్ బీ ఇందులో కాంతి కత్తిని ఆయుధంగా చేసుకొని పోరాడటానికి సిద్ధంగా ఉన్న శక్తివంతమైన అవతారంలో కనిపిస్తున్నాడు.

ఆయన ఫేస్ లో ఇంటెన్స్ ఎమోషన్ ను ముఖం మీద గాయాలను చూస్తుంటే అమితాబ్ శత్రువులను నివారించాలని నిశ్చయించుకున్నట్లు అనిపిస్తుంది. ట్రైలర్ కోసం వేచి చూసే అభిమానుల ఉత్సాహాన్ని ఈ మోషన్ పోస్టర్ మరింత పెంచిందని చెప్పాలి.

ఈ సందర్భంగా కింగ్ నాగ్ ట్వీట్ చేస్తూ ''అద్భుతమైన & ఉత్తేజకరమైన అమితాబ్ బచ్చన్ తో మళ్లీ పని చేయడం చాలా సంతోషంగా ఉంది'' అని పేర్కొన్నారు. కొన్నేళ్ల బగ్యాప్ తర్వాత నాగార్జున హిందీలో చేసిన సినిమా కావడంతో.. దక్షిణాది ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

భారీ బడ్జెట్ తో అత్యున్నత సాంకేతిక విలువలతో విజువల్ వండర్ గా తీర్చిదిద్దుతున్నారు. ''బ్రహ్మాస్త్రం పార్ట్ వన్: శివ'' సినిమా 2022 సెప్టెంబర్ 9న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలోకి రాబోతోంది. పాన్ ఇండియా స్థాయిలో హిందీ తెలుగు తమిళం కన్నడ మలయాళ భాషల్లో విడుదల కానుంది.

'బ్రహ్మాస్త్రం' చిత్రాన్ని స్టార్ స్టూడియోస్ - ధర్మ ప్రొడక్షన్స్ - ప్రైమ్ ఫోకస్ సంస్థలు కలిసి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. సౌత్ ఇండియాలో దర్శకధీరుడు బీఎస్ఎస్ రాజమౌళి ఈ మాగ్నమ్ ఓపస్ కు సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు.