Begin typing your search above and press return to search.

'బ్రహ్మాస్త్ర' విజన్ - అస్త్రావర్స్ మెయిన్ కాన్సెప్ట్ ఇదే..!

By:  Tupaki Desk   |   13 July 2022 8:16 AM GMT
బ్రహ్మాస్త్ర విజన్ - అస్త్రావర్స్ మెయిన్ కాన్సెప్ట్ ఇదే..!
X
మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా మూవీ "బ్రహ్మాస్త్ర" పార్ట్-1 విడుదలకు సిద్ధమవుతోంది. బాలీవుడ్ డైరెక్టర్ అయాన్ ముఖర్జీ అత్యంత ప్రతిష్టాత్మకంగా మూడు భాగాలుగా తెరకెక్కించిన ఈ సినిమా తెలుగులో "బ్రహ్మస్త్రం" పేరుతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇందులో రణ్ బీర్ కపూర్ - అలియా భట్ జంటగా నటించగా.. బిగ్ బీ అమితాబ్ బచ్చన్ - కింగ్ అక్కినేని నాగార్జున - మౌనీ రాయ్ కీలక పాత్రలు పోషించారు.

భారీ స్థాయిలో రూపొందిన ఈ సినిమా ఫస్ట్ పార్ట్ ని "బ్రహ్మాస్త్రం: మొదటి భాగం శివ" అనే పేరుతో 2022 సెప్టెంబర్ 9న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జోరుగా ప్రమోషన్స్ చేస్తున్నారు. ఇప్పటికే వచ్చిన క్యారక్టర్ పోస్టర్స్ మరియు ట్రైలర్ ఈ ఫాంటసీ అడ్వెంచర్ ఫిలింపై ఆసక్తిని రెట్టింపు చేశాయి. ఈ క్రమంలో బ్రహ్మాస్త్ర విజన్ ఇంగ్లీష్ వెర్షన్ ను కింగ్ నాగ్ లాంచ్ చేశారు.

"బ్రహ్మాస్త్ర విడుదలకు కేవలం 2 నెలలే ఉంది. అయాన్ ముఖర్జీ యొక్క బ్రహ్మాస్త్ర విజన్ మరియు అస్త్రావర్స్ కాన్సెప్ట్ ను లోతుగా తెలుసుకుందాం" అని నాగార్జున పేర్కొన్నారు. పురాతనకాలంలోని వివిధ అస్త్రాలు, వాటి ప్రత్యేకతలు.. వాటి వెనుక రహస్యాలు విశేషాలు మరియు ఆధునిక యుగంలో అస్త్రాల పాత్ర వంటివి ఈ వీడియోలో దర్శకుడు అయాన్ ముఖర్జీ వివరించారు.

'విజన్ ఆఫ్ బ్రహ్మాస్త్ర' లో అస్త్రాల ఆవిర్భావం గురించి.. వాటిల్లో వానరాస్త్ర - నంది అస్త్ర - ప్రభాస్త్ర - జలాస్త్ర - పవనాస్త్ర మరియు బ్రహ్మాస్త్రలు ఉన్నాయని తెలియజేశారు. అస్త్రాలలోకెళ్లా బ్రహ్మాస్త్ర చాలా శక్తివంతమైనదని.. మహర్షులు మరియు మిగతా అస్త్రాలు దాన్ని కాపాడుకుంటూ వస్తున్నాయని పేర్కొన్నారు.

కాలక్రమేణా ఈ అస్త్రాలను మహర్షులు తమ వంశపారం పర్యంగా సంరక్షిస్తూ వస్తుంటారు. ఇవి ప్రస్తుత కాలంలో కూడా వివిధ రూపాల్లో ఉనికిలో ఉన్నాయి. శివ అనే యువకుడు తను అగ్ని అస్త్రం అని.. తనలో అతీత శక్తులు ఉన్నాయని గుర్తిస్తాడు. ఇతర అస్త్రాలతో అతనికున్న సంబంధం ఏంటి? బ్రహ్మర్షి పుట్టిన ఈ అస్త్రాలన్నీ దుష్టశక్తుల నుంచి ఎలా కాపాడబడ్డాయనేది 'బ్రహ్మాస్త్ర పార్ట్1:శివ' లో చూపించబోతున్నారు.

భారీ బడ్జెట్ తో అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానంతో విజువల్ వండర్ గా 'బ్రహ్మాస్త్ర' చిత్రాన్ని తెరకెక్కించారని తెలుస్తోంది. స్టార్ స్టూడియోస్ - ధర్మ ప్రొడక్షన్స్ - ప్రైమ్ ఫోకస్ మరియు స్టార్‌ లైట్ పిక్చర్స్ సంస్థలు కలిసి ఈ ట్రాయాలజీని నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో హిందీ, తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో విడుదల చేయనున్నారు. సౌత్ ఇండియాలో ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి ఈ సినిమాను సమర్పిస్తున్నారు.