Begin typing your search above and press return to search.

'బ్ర‌హ్మాస్ర్త‌-2' లో షారుక్ ఖాన్ హీరో!

By:  Tupaki Desk   |   22 Sep 2022 1:30 AM GMT
బ్ర‌హ్మాస్ర్త‌-2 లో షారుక్ ఖాన్ హీరో!
X
ఇటీవ‌ల రిలీజ్ అయిన `బ్ర‌హ్మ‌స్ర్త` మొద‌టి భాగం భారీ ఓపెనింగ్స్ ద‌క్కించుకున్న సంగ‌తి తెలిసిందే. అంతిమంగా బ్రేక్ ఈవెన్ కాన‌ప్ప‌టికీ బాలీవుడ్ కి ఊర‌ట‌నిచ్చే వ‌సూళ్లే ఇవి. దాదాపు 200 కోట్ల వ‌సూళ్ల‌తో బాలీవుడ్ కి బూస్టింగ్ లా నిలిచింది. బాయ్ కాట్ ప్ర‌భావం..నెగిటివ్ టాక్ కొంత వ‌ర‌కూ ప్ర‌భావం చూపిన‌ప్ప‌టికీ ఓపెనింగ్స్ ప‌రంగా తిరుగ‌లేని చిత్రంగానే నిలిచింది.

దీంతో బ్ర‌హ్మ‌స్ర్త‌-2 కి ఊపిరి పోసిన‌ట్లు అయింది. ఈ నేప‌థ్యంలో ద‌ర్శ‌కుడు ఆయాన్ ముఖ‌ర్జీ అప్పుడే రెండ‌వ భాగం ప‌నులు ప్రారంభించారు. ఇప్ప‌టికే ఓ అగ్ర హీరో ర‌ణ‌బీర్ పాత్ర పోషిస్తున్న‌ట్లు ప్ర‌చారం సాగుతోంది. ఈ నేప‌థ్యంలో తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో రణబీర్ మాట్లాడుతూ..`` తాను మరియు అయాన్ ఈ పాత్ర కోసం షారుక్ ఖాన్‌ను ఎంపిక చేసుకునేందుకు ప్లాన్ చేస్తున్నామన్నారు.

కానీ షారుక్ ఇదే చిత్రంలో మోహ‌న్ భార్గ‌వ్ అనే సైటింస్ట్ పాత్ర‌లో న‌టించారు. ఆ పాత్ర మొదటి భాగంలో చంపబడుతుంది. మ‌రి ఇప్పుడు అదే రోల్ ని రెండ‌వ భాగంలో లీడ్ రోల్ గా చ‌ర్చ‌కు రావ‌డంపై ఆస‌క్తి సంత‌రించుకుంటుంది. అయితే షారుక్ ని ఆయాన్ ఇలా తెర‌పైకి తీసుకు రావ‌డం అంద‌మైన ఆలోచ‌న‌గా క‌నిపిస్తుంది. ప్రస్తుతం ఆయాన్ ఆ పాత్రని ఎలా మ‌ల‌చాలి? అన్న కోణంలో సీరియ‌స్ గా వ‌ర్క్ చేస్తున్న‌ట్లు ర‌ణ‌బీర్ మాట‌ల్ని బ‌ట్టి తెలుస్తోంది.

దీన్ని బ‌ట్టి పార్ట్ 2 లో బ‌రువైన బాధ్య‌త‌లు షారుక్ మోయ‌బోతున్నార‌ని దాదాపు ఓ అంచ‌నాకి రావొచ్చు. ఇంకా రెండ‌వ భాగంలో ఇంకెంత మంది బిగ్ స్టార్స్ ని సీన్ లోకి తీసుకొస్తారు? అన్న‌ది చూడాలి. మొద‌టి భాగాన్ని 400 కోట్ల భారీ బ‌డ్జెట్ తో నిర్మించారు. రెండ‌వ భాగం స్పాన్ పెరుగుతోన్న నేప‌థ్యంలో బ‌డ్జెట్ 400 కోట్ల‌కు మించే ఉండే అవ‌కాశం ఉంది.

మొద‌టి భాగంలో వ‌చ్చిన న‌ష్టాల్ని రెండ‌వ భాగంలో భ‌ర్తీ చేయాలి అన్న టార్గెట్ తో ఆయాన్ బ‌రిలోకి దిగే ఛాన్స్ ఉంది. స్టార్ స్టూడియోస్..ధ‌ర్మ ప్రొడ‌క్ష‌న్స్.. ప్రైమ్ ఫోక‌స్..స్టార్ లైట్ పిక్చ‌ర్స్ తొలి భాగాన్ని నిర్మించిన సంగ‌తి తెలిసిందే. మ‌రి మ‌లిభాగం కోసం ఇవే సంస్థ‌లు కొన‌సాగ‌తాయా? అన్న‌ది చూడాలి.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.