Begin typing your search above and press return to search.
బ్రహ్మి.. ఎమ్మెస్‌ను గుర్తుకు తెస్తున్నాడే..
By: Tupaki Desk | 11 April 2015 1:00 PM ISTఎమ్మెస్ నారాయణ అనగానే గుర్తుకొచ్చే క్యారెక్టర్లలో సాల్మన్ రాజు పాత్ర ఒకటి. దుబాయ్ శీనులో ఆ క్యారెక్టర్ ఏ రేంజిలో పేలిందో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఏజ్ బార్ అయిన హీరో క్యారెక్టర్లో ఎమ్మెస్ చేసిన విన్యాసాల గురించి తలుచుకుంటే చాలు నవ్వొచ్చేస్తుంది. ఇప్పుడు బ్రహ్మానందం కూడా ఇదే టైపు క్యారెక్టర్ చేస్తున్నాడు 'దోచేయ్' సినిమాలో.
ఇందులో బ్రహ్మి క్యారెక్టర్ పేరు బుల్లెట్ బాబు. విగ్గు పెట్టుకుని నటించే సీనియర్ హీరో క్యారెక్టర్ తనదని బ్రహ్మి ఆడియో ఫంక్షన్లో వెల్లడించాడు. ఇది కథను మలుపు తిప్పే పాత్ర అవుతుందని అంటున్నాడు బ్రహ్మి. ఇంకో విశేషమేంటంటే.. తన క్యారెక్టర్ ద్వారా ఇండస్ట్రీపై సెటైర్లు కూడా వేయబోతున్నట్లు చెప్పాడు బ్రహ్మి. సాధారణంగా ఆడియో ఫంక్షన్లు ఎలా చేస్తారనే దానిపై స్ఫూఫ్ ఉంటుందని.. అది చూసి నవ్వాపుకోవడం కష్టమని అన్నాడు బ్రహ్మి. ఈ మాట 'దోచేయ్' ఆడియో వేడుక వేదిక మీది నుంచే బ్రహ్మి చెప్పడం విశేషం.
తాను ఎన్నో క్యారెక్టర్లు చేశానని.. ఐతే సుధీర్ వర్మ తనతో కొత్త రకం కామెడీ చేయించాడని... తనతో ఇలాంటి క్యారెక్టర్ చేయించాలన్న ఆలోచన అతడికి ఎందుకొచ్చిందో ఏమో అని.. ఐతే తన ప్రేక్షకులకు కచ్చితంగా నచ్చుతుందని చెప్పాడు బ్రహ్మి. ఈ మధ్య బ్రహ్మి క్యారెక్టర్లు సరిగా పేలట్లేదన్న అభిప్రాయాలు వినిపిస్తున్న నేపథ్యంలో బుల్లెట్ బాబు క్యారెక్టరైనా బ్రహ్మిని నిలబెడుతుందేమో చూద్దాం.