Begin typing your search above and press return to search.
అందుకే డబ్బువిషయంలో అంత కఠినంగా ఉంటాను
By: Tupaki Desk | 1 Dec 2021 5:00 AM ISTసినిమా పరిశ్రమలో కొంతమంది ఆర్టిస్టులు డబ్బు విషయంలో నిర్మొహమాటంగా వ్యవహరిస్తుంటారు. అందుకు కారణం అంతకుముందు వాళ్లకి ఎదురైన అనుభవాలనే చెప్పుకోవాలి. డబ్బు లేకపోతే జీవితం నడవదు .. గడవదు. అందువల్లనే ఫైనల్ చెక్ చేతికి వచ్చిన తరువాతనే డబ్బింగ్ కి వస్తామని చెప్పేవాళ్లు కనిపిస్తుంటారు. అలా డబ్బు విషయంలో బ్రహ్మానందం కూడా చాలా కఠినంగా వ్యవహరిస్తారనే టాక్ ఉంది. 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో ఈ విషయాన్ని గురించిన ప్రస్తావన వచ్చినప్పుడు, బ్రహ్మానందం తనదైన శైలిలో స్పందించారు.
" ఒక్క సినిమా ఇండస్ట్రీలోని వారికే కాదు .. అందరికీ నేను చాలా సిన్సియర్ గా చెబుతున్నాను. డబ్బుకు ప్రతి ఒక్కరూ విలువ ఇవ్వాలి .. ఎందుకంటే 'ధనం మూలం ఇదమ్ జగత్' అన్నారు. అన్నిటికీ కావలసింది డబ్బే. చాలామందికి డబ్బు విలువ తెలియదని నేను అనను. విలువ తెలుసుకోవడానికి ప్రయత్నం చేయరు. మొన్న కరోనా వచ్చినప్పుడు .. చాలా కష్టం వచ్చింది .. ఎవరైనా సాయం చేస్తే బాగుండును అని చాలామంది ఎదురుచూశారు. అక్కడికి వెళ్లి .. ఇక్కడికి వెళ్లి మూటలు తెచ్చుకుని ఈ నెల రోజులు గడిస్తే చాలు అని అనుకున్నారు.
ఎందుకు అలీ ఈ పరిస్థితి .. ఒక్కసారి జాగ్రత్తగా పరిశీలించండి. ఇండస్ట్రీలో రోజుకి 1250 రూపాయలకి తక్కువగా పనిచేసే టెక్నీషియన్స్ ఎవరూ లేరు. 1250 రూపాయలలో 1150 రూపాయలే వచ్చాయనుకుని .. 100 రూపాయలు తనవి కాదనుకుని దాచుకోగలిగితే .. ఏ కష్టకాలం మనకి వచ్చినా .. ఏ ఇబ్బంది మనకి వచ్చినా .. ఏ బాధ వచ్చినా .. ఎవరి ముందు చేతులు కట్టుకుని నుంచోవలసిన అవసరం ఎవరికీ రాదు. ముఖ్యంగా పెద్ద పెద్ద ఆర్టిస్టులను ఎంతో మందిని చూశాము .. ఎన్నో పేర్లు మనం చెప్పుకోవచ్చు.
రాజనాలగారు .. కాంతారావుగారు .. రాజబాబుగారు .. సావిత్రిగారు .. వీళ్లందరూ కోట్లాది రూపాయలను సంపాదించారు. చివరికి వాళ్లు ఏ స్థితిలోకి వెళ్లిపోయారు? పెద్దవాళ్ల నుంచి మనం ఏం నేర్చుకోవాలి కాదు, ఏం నేర్చుకోకూడదో అది నేర్చుకోవాలి. అందుకే నేను డబ్బుకు విలువనిస్తాను .. గౌరవిస్తాను. చాలామంది బ్రహ్మానందం షూటింగుకి 9 గంటల తరువాత వస్తారు .. సాయంత్రం 6 గంటల తరువాత వెళ్లిపోతాడని చెప్పుకుంటూ ఉంటారు. పైగా మధ్యాహ్నం 1 గంట నుంచి 2:30 .. 3:00 గంటలవరకూ రాడు అంటారు. ఇది నూటికి నూరుపాళ్లు నిజం.
ఎందుకంటే 35 సంవత్సరాల పాటు రోజుకు 3 .. 4 షిఫ్టులు పనిచేశాను. ఒకే రోజున 3 స్టేట్స్ లో షూటింగు చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇలా డే అండ్ నైట్ షూటింగులతో ఎన్నో తిప్పలు పడ్డాను. ఫుడ్డు తినీ .. తినక .. తిన్నది అరక్క వాంతులు చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. ఇంతకాలం శరీరం ఇంత కష్టపడిన తరువాత దానికి కూడా కొంచెం రెస్ట్ ఇవ్వాలి కదా. అందుకే కాస్త సినిమాలు తగ్గించుకున్నాను. ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకునే నేను ఫలానా సమయానికి వస్తాను .. ఫలానా సమయం వరకూ చేస్తాను అని ముందుగానే చెబుతుంటాను .. అంతే" అని చెప్పుకొచ్చారు.