Begin typing your search above and press return to search.

తథాస్తు దేవతలు అలా దీవించారా?

By:  Tupaki Desk   |   7 Jun 2018 7:00 AM IST
తథాస్తు దేవతలు అలా దీవించారా?
X
కమెడియన్ గా స్టార్ స్టేటస్ అనుభవించడం అంటే ఎవరైనా సరే బ్రహ్మానందాన్ని చూసి తెలుసుకోవాల్సిందే. అసలు బ్రహ్మీ లేని సినిమా ఉండేది కాదు.. ఆయన అండ చూసుకుని ఆడేసిన స్టార్ హీరోల సినిమాలు కూడా ఉన్నాయి. కానీ ఇదంతా ఇప్పుడు గతమే. ఇప్పుడు బ్రహ్మానందం సినిమాల్లో చాలా తక్కువగా కనిపిస్తున్నాడు.

అవి కూడా చెప్పుకోదగిన పాత్రలుగా ఉండడం లేదు. పైగా కొత్త కమెడియన్ల కంటే చిన్నపాటి రోల్స్ లో కనిపిస్తున్నాడు. గతంలో ఓ సారి బ్రహ్మానందం తన స్టార్ డంపై తానే స్పందించాడు. ప్రతీ నటుడికి.. వెలుగులు విరజిమ్మే లైట్ ను దేవుడు కొంతకాలం స్విచ్ ఆన్ చేస్తాడని.. కొంతకాలం పోయాక ఆఫ్ చేస్తాడని.. కానీ తన విషయంలో మాత్రం దేవుడు స్విచాఫ్ చేయడం మరిచిపోయి ఉంటాడని అన్నాడు బ్రహ్మీ. అంటే.. ఇది వినేందుకు కామెడీగానే ఉన్నా.. అలా జరగలేదేంటో అనే అర్ధం ఇస్తుంది. మరి ఎవరి కోరిక అయినా తీర్చడం దేవుడి విధి కదా.

కాకపోతే కాస్త ముందు వెనుక అవుతాయి అంతే. బ్రహ్మానందం అలా మాట్లాడిన సమయం ఏంటో కానీ.. ఆ తర్వాత మాత్రం పక్కాగా అదే జరిగిందని అంటున్నారు. తథాస్తు దేవతలు బ్రహ్మానందం కోరికను మన్నించి ఉంటారని.. తథాస్తు అని దీవించి ఉంటారని చెబుతున్నారు. ఏదేమైనా బ్రహ్మీ లాంటి గిన్నిస్ రికార్డ్ కమెడియన్ కు.. ఇలాంటి పరిస్థితి ఊహాతీతమే.