Begin typing your search above and press return to search.
బ్రహ్మీ స్పీడుకి బ్రేకులేస్తున్నారా?
By: Tupaki Desk | 12 Aug 2015 1:48 AM ISTహాస్య బ్రహ్మీ 1000 సినిమాలకు చేరువలో ఉన్నాడని ఇదివరకే చెప్పుకున్నాం. ప్రపంచంలోనే ఏ ఇతర కమెడియన్ ఇన్ని సినిమాల్లో నటించనేలేదు. ఆరకంగా ఇదో గిన్నిస్ రికార్డ్ కూడా. ఇప్పటికీ బ్రహ్మానందం క్రేజు తగ్గనేలేదు. బ్రహ్మీ లేనిదే స్టార్ హీరోల సినిమాల్లేవ్ అన్న చందంగా పరిస్థితి కొనసాగుతోంది.
అయితే ఇటీవలి కాలంలో మన స్టార్ డైరెక్టర్లు, హీరోలు బ్రహ్మానందం లేకుండానే సినిమాలు ప్లాన్ చేసుకుంటున్నట్టు కనిపిస్తోంది. ఇప్పటికిప్పుడు లెక్కలు తీస్తే బాహుబలి, శ్రీమంతుడు చిత్రాల్లో అతడు లేనేలేడు. చరణ్ -శ్రీనువైట్ల సినిమా, పవన్ 'సర్ధార్' సినిమాల్లో బ్రహ్మానందం లేడు. అంటే ఆయా చిత్రాల దర్శకులు ఉద్ధేశపూర్వకంగానే బ్రహ్మీకి క్యారెక్టర్ లేకుండా చేశారా? అన్న ఆసక్తికర చర్చ టాలీవుడ్ లో మొదలైంది. బ్రహ్మానందం డామినేషన్ భరించలేకే అతడిని సినిమాల్లో పెట్టుకోవడం లేదని అంటున్నారు. అతడు తనకి ఉన్న కాంటాక్ట్స్ తో ఇప్పటికే బోలెడన్ని సినిమాల్లో నటించేశాడు. ఇప్పుడున్న కమెడియన్లందరిలోనూ అతడు సీనియర్. కాబట్టి బ్రహ్మీ డామినేషన్ అటు హీరో, ఇటు దర్శకుడు ఇద్దరిపైనా ఉంటోందని అనుకుంటున్నారు.
నేను లేనిదే సినిమాలు ఆడవు అనే గర్వంలో ఉన్నాడని ప్రచారం సాగుతోంది. దీనికి కౌంటర్ గానే దర్శకులు కూడా ఆల్టర్నేట్ గా వెన్నెల కిషోర్, తాగుబోతు రమేష్, పృథ్వీ, శ్రీనివాసరెడ్డి వంటి కమెడియన్లతో బ్లాంక్ ఫిలప్ చేస్తున్నారని చెప్పుకుంటున్నారు. అయితే ఇందులో వాస్తవం ఎంతో బ్రహ్మీ నోరు విప్పితేనే తెలిసేది.