Begin typing your search above and press return to search.

బ్రహ్మాజి కొడుకు కూడా పెట్టేస్తున్నాడు

By:  Tupaki Desk   |   27 Jan 2018 6:47 AM GMT
బ్రహ్మాజి కొడుకు కూడా పెట్టేస్తున్నాడు
X
టాలీవుడ్ లో సినీ నటుల కుమారులు చాలా వరకు సక్సెస్ అయ్యారు. అలాగే డిజాస్టర్స్ చుసిన వారు కూడా చాలా మందే ఉన్నారు. కొందరైతే మొదటి సినిమా తరువాత మళ్లీ కనిపించలేదు. ఇక మరికొంత మంది అయితే పరిచయం కాబోతున్నారని వార్తల్లో నిలుస్తున్నారు గాని వెండితెరపై ఎంట్రీ మాత్రం ఇవ్వడం లేదు. ఇక అసలు మ్యాటర్ లోకి వస్తే సీనియర్ నటుడు బ్రహ్మాజీ ఇండస్ట్రీలో ఎంతో కాలంగా కొనసాగుతోన్న సంగతి తెలిసిందే.

అయితే ఆయన కుమారుడు సంజయ్ హీరోగా ఎంట్రీ ఇస్తాడని చాలా కాలంగా వార్తలు వచ్చాయి. కానీ ఎంట్రీ మాత్రం ఇవ్వలేదు. సంజయ్ ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు కృష్ణ వంశీ దగ్గర కొన్ని సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేశాడు. అయితే సినిమాల్లోకి ఎప్పుడు ఎంట్రీ ఇస్తాడో గాని బిజినెస్ లోకి మాత్రం ఎంట్రీ చేశాడు. ఫిల్మ్ నగర్ సంజయ్ ఒక రెస్టారెంట్ ను స్టార్ట్ చేశాడు. బ్రహ్మాజీ దంపతులు సినిమ ప్రముఖులతో చాలా సన్నిహితంగా ఉంటారు.

ఎక్కడ పార్టీలు జరిగినా కనిపిస్తూ ఉంటారు. ఇక బ్రహ్మాజీ భార్య కుమారుడు కలిసి ఇప్పుడు రెస్టారెంట్ ను చూసుకుంటున్నారు. అయితే గత కొంత కాలంగా సినీ ప్రముఖులు ఆహారానికి సంబందించిన బిజినెస్ లలో అడుగు పెడుతూ మంచి లాభాలను అందుకుంటున్నారు. సందీప్ కిషన్ - శశాంక్ - మంచు లక్ష్మి - నితిన్ - అల్లు అర్జున్ వంటి వారు ఈ తరహా బిజినెస్ లలో ఇప్పటికే చాలా బాగా రానిస్తున్నారు.