Begin typing your search above and press return to search.

మాస్ లుక్కులో బ్రహ్మాజీ కొడుకు న్యూ మూవీ ఫస్ట్ లుక్..!

By:  Tupaki Desk   |   29 May 2021 8:30 AM GMT
మాస్ లుక్కులో బ్రహ్మాజీ కొడుకు న్యూ మూవీ ఫస్ట్ లుక్..!
X
టాలీవుడ్ ఇండస్ట్రీలో మరో నటుడి వారసుడు కథానాయకుడుగా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. సినీప్రపంచం అంటే అందరికి మినిమం తెలిసే ఉంటుంది. ఇక్కడ బడా హీరోలు - ఇతర నటుల ఫ్యామిలీస్ నుండి వారసులు హీరోలుగా వస్తూనే ఉంటారని.. తాజాగా సోలో హీరోగా రాబోతున్నాడు ప్రముఖ యాక్టర్ బ్రహ్మాజీ తనయుడు సంజయ్ రావు. ప్రస్తుతం సంజయ్ హీరోగా నటిస్తున్న సినిమా 'గుట్టుచప్పుడు'. ఈరోజు హీరో సంజయ్ పుట్టినరోజు కావడంతో ఈ సందర్బంగా మేకర్స్ సినిమా నుండి సంజయ్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. అయితే ఫస్ట్ లుక్ తో పాటుగా ఒకేసారి మోషన్ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఫస్ట్ లుక్ తో పాటు మోషన్ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

అయితే ఈ సందర్బంగా మేకర్స్ తో పాటు హీరో సంజయ్ తన బర్త్ డే వేడుకలు సంతోషం స్టూడియోలో సెలెబ్రేట్ చేసుకున్నాడు. మేకర్స్ హీరోతో కేక్ కట్ చేయించి విషెస్ తెలిపారు. అనంతరం హీరో సంజయ్ - దర్శకనిర్మాతలు - టెక్నీషియన్స్ ఇలా అందరూ సినిమా గురించి మాట్లాడారు. ముందుగా హీరోగా సంజయ్ మాట్లాడి.. 'అందరికి థాంక్స్ చెప్పాడు. అలాగే డైరెక్టర్ ప్రొడ్యూసర్స్ తో పాటు తమ చిత్రం గురించి మాట్లాడి త్వరలోనే ప్రేక్షకుల ముందుకు వస్తామని' తెలిపాడు. అయితే ఈ సినిమా యూత్ ఫుల్ రొమాంటిక్ యాక్షన్ మూవీగా వైజాగ్ నేపథ్యంలో తెరకెక్కుతోంది. ఓ పిట్టకథ మూవీతో డెబ్యూ అయినటువంటి సంజయ్ రావు.. ఈ సినిమాతో సోలో హీరోగా తనను తాను ప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు.

అయితే ఈ సినిమా గురించి ప్రొడ్యూసర్ లివింగ్ స్టన్ మాట్లాడుతూ.. ప్రస్తుతం ఉన్న సొసైటీలో నేటి యువతీయువకులు ఎలా బాధ్యతారాహిత్యంగా ఉంటున్నారనే సామాజిక పరిస్థితులను ప్రస్తావిస్తూ.. లవ్ - యాక్షన్ - రొమాన్స్ నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు తెలిపాడు. ఈ సినిమాకు మణింద్రన్ దర్శకత్వం వహిస్తుండగా.. ఈ సినిమాలో హీరోయిన్ గా నటాషా సింగ్ కనిపించనుంది. ప్రస్తుతం ఫస్ట్ లుక్ చూస్తే రఫ్ లుక్కులో హీరో సంజయ్ చొక్కా లేకుండా కూర్చొని ఓ చేతిలో సిగరెట్ పట్టుకొని మరో చేతికి గొలుసు చుట్టుకొని చాలా భీకరంగా కనిపిస్తున్నాడు. ఇదిలా ఉండగా.. ఈ గుట్టుచప్పుడు సినిమాకు హరి గౌర సంగీతం అందిస్తున్నాడు. మొత్తానికి మరో సినీ బాక్గ్రౌండ్ ఫ్యామిలీ నుండి హీరో సిద్ధం అవుతున్నాడు. చూడాలి మరి ఫస్ట్ సక్సెస్ అందుకుంటాడేమో!