Begin typing your search above and press return to search.

క‌రుడు క‌ట్టిన తీవ్ర‌వాదిగా బ్ర‌హ్మాజీ!

By:  Tupaki Desk   |   14 Sep 2022 4:18 PM GMT
క‌రుడు క‌ట్టిన తీవ్ర‌వాదిగా బ్ర‌హ్మాజీ!
X
కొత్త త‌ర‌హా సినిమాల‌ని ప్రేక్ష‌కులు ఆద‌రిస్తున్నారు. విభిన్న‌మైన క‌థ‌, ఆక‌ట్టుకునే పాత్ర‌ల‌తో రూపొందే చిన్న సినిమాల‌కు భారీ విజ‌యాల్ని అందిస్తున్నారు. దీంతో మేక‌ర్స్ కొత్త త‌ర‌హా క‌థ‌ల‌ని ప్రోత్స‌హిస్తూ సినిమాలు నిర్మించ‌డం ఈ మ‌ధ్య మ‌రి ఎక్కువైపోతోంది. తెలుగు సినిమాకు `బాహుబ‌లి` త‌రువాత దేశ వ్యాప్తంగా మంచి మార్కెట్ ఏర్ప‌డ‌టంతో ప్ర‌తీ చిన్న పాయింట్ తో కూడా వెరైటీ మూవీస్ ని తెర‌పైకి తీసుకొస్తున్నారు. అలాంటి క‌థ‌తో కూపొందుతున్న లేటెస్ట్ మూవీ `లైక్ షేర్ అండ్ స‌బ్స్ స్క్రైబ్‌`.

సంతోష్ శోభ‌న్ హీరోగా న‌టిస్తున్నాడు. మేర్ల‌పాక గాంధీ ద‌ర్శ‌క‌త్వంలో వెంక‌ట్ బోయిన‌ప‌ల్లి ఈ మూవీని నిర్మిస్తున్నారు. `జ‌తార‌త్నాలు` చిట్టి ఫ‌రియా అబ్ధుల్లా హీరోయిన్ గా న‌టిస్తోంది. ఈ నేప‌థ్యంలో ఈ మూవీ ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ నుంచి ఈ మూవీ ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. నితిన్ న‌టించిన `మాస్ట్రో`తో ఫ్లాప్ ని సొంతం చేసుకుని తీవ్రంగా నిరాశ ప‌రిచిన మేర్ల‌పాక గాంధీ ఈ మూవీతో ప్రేక్ష‌కుల ముందుకొస్తున్నారు.

ఆత్యంతం కామెడీ ఎంట‌ర్ టైన‌ర్ గా సాగే సినిమాలా క‌నిపిస్తోంది. తాజాగా బుధ‌వారం చిత్ర బృందం ఈ మూవీలోని కొత్త పాత్ర‌ని ప‌రిచ‌యం చేస్తూ కొత్త పోస్ట‌ర్ ని విడుద‌ల చేశారు. పోస్ట‌ర్ లో బ్ర‌హ్మాజీ తుపాజీ ప‌ట్టుకుని అలీవ్ గ్రీన్ డ్రెస్ లో క‌రుడు క‌ట్టిన తీవ్ర‌వాదిగా క‌నిపిస్తున్నాడు. అంతే కాకుండా క్యారెక్ట‌ర్ పేరు `బ్ర‌హ్మాన్న‌` అని, క్యారెక్ట‌ర్ వైల్డ్‌, వైలెంట్‌, బ్రూత‌ల్ అని, అంతే కాకుండా అత‌ని పొజీష‌న్ పీపీఎఫ్ క‌మాండ‌ర్ అని ప‌రిచ‌యం చేశారు మేక‌ర్స్.

ఇక బ్ర‌హ్మాజీ వెన‌కాల వాంటెడ్.. ప్రైజ్‌ మ‌నీ.. ప‌ట్టిస్తే రూ. 10 ల‌క్ష‌ల రూపాయ‌ల బహుమ‌తి అంటూ క‌నిపిస్తున్న పోస్ట‌ర్స్ న‌వ్వులు పూయిస్తున్నాయి. సినిమాలో బ్ర‌హ్మాజీ న‌క్స‌లైట్ గా క‌నిపించ‌బోతున్నాడా? లేక ఏదైనా పేర‌డీ క్యారెక్ట‌ర్ చేస్తున్నారా? అన్న‌ది తెలియాల్సి వుంది.

బ్ర‌హ్మాజీ పాత్ర‌కు ప్ర‌త్యేకంగా హ్ర‌హ్మ‌న్న పేరుని పెట్టారంటే సెటైరిక‌ల్ కామెడీ కోస‌మే ఇలా బ్ర‌హ్మాజీ పాత్ర‌ని డిజైన్ చేసి వుంటారనే అనుమానాలు వ్య‌క్త మ‌వుతున్నాయి. ఇంత‌కీ సినిమా క‌థేంటీ అన్న‌ది తెలియాలంటే ఈ మూవీ రిలీజ్ వ‌ర‌కు వేచి చూడాల్సిందే.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.