Begin typing your search above and press return to search.
బోర్ గా ఉంది..క్రొయోషియా తీసుకెళ్లు సోనూ..బ్రహ్మాజీ ఫన్నీ ట్వీట్
By: Tupaki Desk | 22 Aug 2020 9:00 AM ISTకరోనా మొదలైనప్పటి నుంచి సోనూ సూద్ ట్విట్టర్ లో అందరికీ అందుబాటులో ఉంటూ సహాయాలు చేస్తున్నాడు. ఈ సారి ఆయనను ప్రముఖ నటుడు బ్రహ్మాజీ ఓ వింత కోరిక కోరాడు. అది ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సోనూసూద్... కరోనా లాక్ డౌన్ కాలమంతా దేశమంతా ఇతడి పేరే మారు మోగింది. రీల్ లైఫ్ లో సోనూసూద్ ఒక భయంకరమైన విలన్. కానీ కరోనా కాలం అతడిని ఒక సూపర్ మ్యాన్ ని చేసింది. వలస కార్మికులకు ఆయన చేసిన సేవలు అంతా ఇంతా కాదు. లాక్ డౌన్ ముగిసినా ఇప్పటికీ ఆయన సహాయాలు మాత్రం కొనసాగుతున్నాయి.
సాయం అంటే చాలు స్పందిస్తూ ఆదుకుంటున్నాడు. అయితే ట్విట్టర్ లో కొంతమంది సరదాగా సోనూసూద్ ను వింత కోరికలు కోరుతూ ఆట పట్టిస్తున్నారు. పానీ పూరీ తెచ్చివ్వాలని, బోర్ గా ఉంది.. సాంగ్స్ వినడానికి పీఎస్ 4కావాలని.. ఇలా ట్వీట్ లు పెట్టడం మొదలు పెట్టారు. అలాంటి వాళ్లకు కూడా సోనూసూద్ ఓపిగ్గా సమాధానాలు ఇస్తున్నాడు. కాగా.. మొదటి సారి సోనూసూద్ ను ఓ వీఐపీ కూడా ఆట పట్టించాడు. 'కరోనా కారణంగా హైదరాబాద్ లో ఉండి బోర్ గా ఉందని. తనని క్రొయోషియా పంపించాలని నటుడు బ్రహ్మాజీ ట్వీట్ చేశాడు. ' డియర్ సూపర్ మ్యాన్ సోనూ భాయ్..ఇంటి పట్టునే ఉంటూ డిప్రెషన్ లో ఉన్నా..ఎక్కడికి వెళ్లలేక హైదరాబాద్ లో చిక్కుకు పోయా..మెంటలెక్కుతోంది.. నన్ను క్రొయోషియా తీసుకెళ్లవా.. 'అంటూ బ్రహ్మాజీ ట్వీట్ చేశాడు. బ్రహ్మాజీ కోరిన ఫన్నీ కోరిక ప్రస్తుతం వైరల్ గా మారింది. మరి బ్రహ్మాజీ కి ట్వీట్ కి సోనూ సూద్ ఎలా స్పందిస్తాడు..కోరిన కోరిక తీరుస్తాడా.. అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.