Begin typing your search above and press return to search.

బాలీవుడ్ క్వాలిటీస్ తనలో లేవంటలే

By:  Tupaki Desk   |   25 May 2017 11:45 AM GMT
బాలీవుడ్ క్వాలిటీస్ తనలో లేవంటలే
X
బాలీవుడ్ లో నటించడం అంటే ఏ హీరోకి అయినా ఓ క్రెడిట్ సాధించినట్లే. ఇది ఇండియన్ యాక్టర్స్ కు చెల్లుతుంది కానీ.. హాలీవుడ్ సూపర్ స్టార్స్ కు బాలీవుడ్ లో నటించడం అంత పెద్ద విషయంగా ఏమీ అనిపించదు.

కానీ ఇప్పుడు ఇండియన్ మార్కెట్ సత్తా పెరుగుతుండడం.. హాలీవుడ్ సినిమాలకు భారత్ లో భారీ వసూళ్లు వస్తుండడంతో.. ఇక్కడి మార్కెట్ పై పట్టు సాధించేందుకు హాలీవుడ్ మేకర్స్ బాగానే ప్రయత్నిస్తున్నారు. హాలీవుడ్ స్టార్ హీరో బ్రాడ్ పిట్ ప్రస్తుతం ఇండియా టూర్ లో ఉన్నాడు. వార్ మెషీన్ మూవీ ప్రచారం కోసం ఇండియా వచ్చిన బ్రాడ్ పిట్.. ఆ మూవీ గురించి తెగ పొగిడేస్తున్నాడు. డైరెక్టర్ డేవిడ్ మిడాచ్ పై ప్రశంసలు గుప్పిస్తున్నాడు. అయితే.. ఈ సమయంలో బాలీవుడ్ మూవీలో నటిస్తారా అనే ప్రశ్న బ్రాడ్ పిట్ కు ఎదురైంది.

తాను ఎప్పటికీ బాలీవుడ్ లో నటించలేనని.. ఇందుకు కారణం బాలీవుడ్ సినిమాలు చేసేందుకు అవసరమైన కొన్ని క్వాలిటీస్ తనలో లేవని చెప్పాడు బ్రాడ్. తనకు డ్యాన్స్ చేయడం రాదని.. అందుకే బాలీవుడ్ మూవీ చేయలేనని చెప్పాడు బ్రాడ్. ఇదే ఈవెంట్ లో పాల్గొన్న షారూక్.. 'రెండు చేతులు ముందుకు పక్కకు చాస్తే డ్యాన్స్ వచ్చేసినట్లే' అంటూ తన సిగ్నేచర్ స్టెప్ ను బ్రాడ్ పిట్ తో వేయించి నవ్వులు పూయించాడు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/