Begin typing your search above and press return to search.

చరణ్ కోసం ఆకాశమల్లే

By:  Tupaki Desk   |   11 April 2018 1:07 PM IST
చరణ్ కోసం ఆకాశమల్లే
X
బోయపాటి శీను పరిస్థితి అచ్చంగా పైన చెప్పిన పాట పల్లవిలాగే ఉంది మరి. ఎందుకంటారా. రంగస్థలం ఫినిషింగ్ స్టేజిలో ఉండగానే చరణ్ తో సినిమా చేసే కమిట్మెంట్ మీద షూటింగ్ ప్రారంభించిన దర్శకుడు బోయపాటి శీను ఇప్పుడు రెగ్యులర్ సెట్స్ పైకి వెళ్ళడం కోసం ఎదురు చూస్తున్నాడు. నిజానికి రంగస్థలం అంచనాలకు మించి విజయం సాధించింది. సూపర్ హిట్ అవుతుంది అనుకున్నారు కాని ఏకంగా ఇండస్ట్రీ రికార్డులు తుడిచి పెట్టేంత బ్లాక్ బస్టర్ అవుతుంది అని సుకుమార్ కూడా ఊహించి ఉండడు. సాధారణంగా చరిత్ర సృష్టించే సినిమాల్లో అధిక శాతం ఇలాగే జరుగుతుంది. దీంతో పూర్తిగా సక్సెస్ హ్యంగ్ ఓవర్ లో మునిగి తేలుతున్న చరణ్ బోయపాటి శీను సినిమాను కాస్త ఆలస్యంగా మొదలుపెట్టమని చెప్పినట్టు ఇన్ సైడ్ టాక్.

కారణం రంగస్థలం సక్సెస్ కిక్ పార్టీలతో మొదలుపెట్టి సక్సెస్ మీట్ కు ఏకంగా పవన్ కళ్యాణ్ బాబాయ్ వస్తానని మాటివ్వడం దాకా చరణ్ ఫుల్ జోష్ లో ఉన్నాడు. మగధీర తర్వాత ఎన్నో ఏళ్ళ గ్యాప్ తో నిఖార్సైన ఇండస్ట్రీ హిట్ అందుకున్న ఆనందంతో పాటు మొదటిసారి యునానిమస్ గా తన యాక్టింగ్ గురించి ప్రశంశల జల్లు కురుస్తు ఉండటంతో అందులో నుంచి బయటికి రావడానికి చరణ్ ఇష్టపడుతున్నట్టు లేదు. సర్వం సిద్ధం చేసుకున్న బోయపాటి చరణ్ కోసం ఎదురుచూపుల్లో ఉన్నాడు. మరోవైపు నిర్మాత డివివి దానయ్య కూడా భరత్ అనే నేను వ్యాపార లావాదేవీలు-రిలీజ్ ఏర్పాట్లలో తలమునకలై ఉన్నాడు. ఆయనకూ చరణ్ సినిమా అర్జెంటుగా కానిచ్చేయాలని లేదు. ఓ వారం పది రోజులు ఆగితే పర్వాలేదు అన్న రీతిలోనే ఉన్నట్టు టాక్.

కాని బోయపాటికి ఇక్కడే పెద్ద చిక్కు ఉంది. ఎప్పుడు స్టార్ట్ చేసినా దసరా టైంకంతా ఫినిష్ చేయాలి. అవతల త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా ఇదే డెడ్ లైన్ పెట్టుకుని జూనియర్ ఎన్టీఆర్ తో సినిమా ప్లాన్ చేసుకున్నాడు. ఈ రెండు పూర్తయ్యాక చరణ్-తారక్ ఇద్దరూ రాజమౌళి మల్టీ స్టారర్ కోసం బ్లాక్ అయిపోతారు. ఎంత లేదన్నా 7 నుంచి 8 నెలలు ఈ ఇద్దరి కాల్ షీట్స్ జక్కన్నా తీసేసుకుంటాడు. సో బోయపాటి తక్షణ కర్తవ్యం ఏమిటి అంటే చరణ్ రావడమే అంటున్నాడట.