Begin typing your search above and press return to search.
విలేజ్ బ్యాక్ డ్రాప్ ఎంచుకున్న బోయపాటి
By: Tupaki Desk | 9 May 2016 7:00 PM IST డైరెక్టర్ బోయపాటి శ్రీనివాస్ తన తర్వాతి చిత్రానికి సంబంధించిన కథా చర్చలు అప్పుడే మొదలు పెట్టేశాడు.ఐతే ఈసారి తన కాంపౌండ్ రచయిత ఎమ్.రత్నం ను పక్కకు తప్పించే యోచనలో బోయపాటి ఉన్నారు.దీనికి కారణం మాంజా సినిమాకు డైలాగ్స్ అందించిన రైటర్ చంద్రవంశీకి... బోయపాటి ప్రాముఖ్యత ఇవ్వడమే.అది కూడా విలేజ్ బ్యాక్ డ్రాప్ లో సాగే యాక్షన్ లవ్ స్టోరి కావడంతో రైటర్ చంద్రవంశీని సెలెక్ట్ చేసుకున్నట్లు తెలుస్తోంది.ఇదే చంద్రవంశీ గతంలో లెజెండ్ సినిమాకు సంబంధించిన ఆడియో ఫంక్షన్ లో బోయపాటి ఆలోచనలకు తగ్గట్లుగా 'వీడియో ఏవీ'లను రూపొందించాడు. అప్పుడు అతని వర్క్ నచ్చడంతో చంద్రవంశీకి అవకాశం ఇచ్చినట్లుగా తెలుస్తోంది.
బోయపాటి తన పంథాకు కాస్త దూరంగా వెల్లి మరీ చేస్తోన్న ఈ సినిమాలో బెల్లంకొండ శ్రీనివాస్ యాక్ట్ చేస్తున్నాడు. బోయపాటి గతంలోనే కమిటైన సినిమా కావడంతో... రిస్క్ చేసి మరీ ఈసినిమాను టేకప్ చేస్తున్నాడు.ఐతే స్టార్ డమ్ హీరోలను వదిలి బి గ్రేడ్ హీరోలతో తనలాంటోడు సినిమా చేస్తే... ఇమేజ్ డ్యామేజ్ అవుతుందనే ఆలోచనలో బోయపాటి కూడా ఉన్నాడట. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో సినిమా కాబట్టి కొరటాల - త్రివిక్రమ్ తరహాలోనే అడుగులు వేయబోతున్నాడు.
ఐతే ఈసినిమా పూర్తి స్థాయి ప్రేమ కథగా తయారై తనదైన యాక్షన్ మేళవింపుతో రూపొందనుంది. కథ తయారవ్వడానికి ఇంకో రెండు నెలలు పట్టే ఈసినిమా స్టోరీ సిట్టింగుల్లో బిజీబిజీగా ఉంది.