Begin typing your search above and press return to search.

బోయపాటి - ఇలా అవుతోందేమిటి

By:  Tupaki Desk   |   2 March 2019 10:08 AM IST
బోయపాటి - ఇలా అవుతోందేమిటి
X
ఎన్టీఆర్ కథానాయకుడు మహానాయకుడు బ్లాక్ బస్టర్ అయ్యుంటే బాలయ్య వెంటనే కొత్త సినిమా మొదలుపెట్టేవాడేమో కాని ఇప్పుడా పరిస్థితి దరిదాపుల్లో కనిపించడం లేదు. రెండు భాగాలూ ఒకదాన్ని మించి ఒకటి డిజాస్టర్ కొట్టడంతో నష్టాల తాలుకు లెక్కలు సెటిల్ మెంట్లు వగైరా పనుల్లో బిజీగా ఉన్నట్టు తెలిసింది. ఇదిలా ఉండగా దీని తర్వాత మొదలుపెట్టాల్సిన బోయపాటి శీను సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుందో అర్థం కాని అయోమయం నెలకొంది.

గత కొన్నేళ్ళుగా బాలకృష్ణ చాలా ప్లానింగ్ తో రిలీజ్ డేట్ ముందే ఫిక్స్ చేసుకుని మరీ షూటింగ్ కు వెళ్తున్నారు. కాని బయోపిక్ దెబ్బకు బాగా మూడ్ ఆఫ్ అయినట్టు బయట ఎక్కడైనా కనిపించినప్పుడు అర్థమైపోతోంది. ఈ నేపధ్యంలో తొందరపడకుండా కాస్త నెమ్మదిగానే కొత్త సినిమా పనులు చూసుకోవాలని నిర్ణయించుకున్నట్టు సన్నిహితుల సమాచారం. అయితే దీని కన్నా ముఖ్యమైన పాయింట్ మరొకటి ఉంది

ఇంకో రెండు నెలలు ఆంధ్ర ప్రదేశ్ మొత్తం ఎన్నికల హడావిడి ఓ రేంజ్ లో ఉంటుంది. రెండు ప్రధాన పార్టీలకు తోడు జనసేన కూడా బరిలో దిగడంతో వేడి ఇంకాస్త పెరిగింది. సో బాలకృష్ణ సినిమాలు చేస్తానంటే కుదరదు. చాలా యాక్టివ్ గా ప్రచారంలో పాల్గొనాలి. పవన్ కళ్యాణ్ కామెంట్స్ కు బదులు బాలయ్యతోనే చెప్పించాలని అభిమానుల ఆకాంక్ష. అందులోనూ బాలకృష్ణ సిట్టింగ్ ఎమెల్యే కూడా.

సో ఎలక్షన్ నోటిఫికేషన్ వదలడం ఆలస్యంలో ఈయనకు తీరిక దొరకడం కష్టమే. ఈ మేరకు అప్పుడే టిడిపి వర్గాలు షెడ్యూల్ కూడా ఫిక్స్ చేసాయట. బోయపాటికి వేచి చూడటం మినహా వేరే ఆప్షన్ లేదు. పోనీ ఇంకో హీరోతో వేరేది చేద్దామంటే చిరంజీవి మొదలుకుని బెల్లకొండ సాయి శ్రీనివాస్ దాకా ఎవరూ ఖాళీ లేరు. సో తప్పదు మరి.