Begin typing your search above and press return to search.

కౌశల్ వైపు బోయపాటి చూపు

By:  Tupaki Desk   |   17 Sept 2018 8:32 PM IST
కౌశల్ వైపు బోయపాటి చూపు
X
బిగ్ బాస్ షో సెకండ్ సీజన్లో అందరికంటే కౌశల్ మందా పేరే ఎక్కువగా వినిపిస్తోంది. హౌస్ లో వాతావరణం ఎలా ఉన్నా బయటమాత్రం కౌశల్ కు ఫాలోయింగ్ భీభత్సంగా పెరిగింది. కౌశల్ ఆర్మీ పేరుతో వాళ్ళందరూ తమ అభిమానాన్ని చాటుతున్నారు. ఇక రెండు వారాల్లో సీజన్ ముగుస్తుంది కాబట్టి కౌశల్ పై ఫిలిం మేకర్స్ దృష్టి కూడా పడిందని టాక్ వినిపిస్తోంది.

స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుకు సంబంధించిన టీం ఇప్పటికే కౌశల్ ను తమ నెక్స్ట్ సినిమాకోసం సైన్ చేసేందుకు కౌశల్ వైఫ్ ను సంప్రదించడం జరిగిందట. బిగ్ బాస్ రూల్స్ ప్రకారం ఇప్పుడు కౌశల్ తో సంప్రదింపులు జరపడం కుదరదు కాబట్టి కౌశల్ బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చిన తర్వాత ఈ విషయం పై చర్చలు జరుపుతారట. ఇక ఏ సినిమా కోసం అని ఖచ్చితంగా తెలియక పోయినా బోయపాటి - బాలయ్య కాంబినేషన్ లో రానున్న చిత్రం కోసం అయి ఉండొచ్చని అంటున్నారు. బాలయ్య సినిమాలో విలన్ రోల్ కోసం బోయపాటి ఇప్పటికే వెతుకుతున్నాడట.. ఇప్పుడు కౌశల్ తో ఆ సెర్చ్ ముగిసిందని అంటున్నారు.

కౌశల్ ఇప్పటికే యాక్టర్ గా కొన్ని సినిమాలలో నటించినప్పటికీ బ్రేక్ రాలేదు. ఇక బోయపాటి సినిమాలో అవకాశం అంటే అదొక మంచి అవకాశమే. మరి బిగ్ బాస్ క్రేజ్ ద్వారా వచ్చిన క్రేజ్ ను సరిగ్గా ఉపయోగించుకుంటే తెలుగుతెరకు మరో టాలెంటెడ్ ఆర్టిస్ట్ దొరకడం ఖాయం.