Begin typing your search above and press return to search.
చిరు సలహాతో బోయపాటి కాస్త తగ్గించాడట!
By: Tupaki Desk | 11 Sept 2018 3:22 PM ISTమెగా హీరోలు ఏ సినిమా చేసినా కూడా ఎక్కువ శాతం కథలకు చిరంజీవి గ్రీన్ సిగ్నల్ ఇవ్వాల్సిందే. ఇక రామ్ చరణ్ నటించే ప్రతి సినిమా కథను ఒకటి రెండు సార్లు చిరంజీవి విన్న తర్వాతే ఓకే చెప్తారని సినీ వర్గాల్లో టాక్ ఉంది. చరణ్ విషయంలో ఎలాంటి అశ్రద్ద చూపించకుండా ప్రతి సినిమా స్క్రిప్ట్‌ను వినడంతో పాటు - ఆ స్క్రిప్ట్ కు ఏదైనా మార్పులు చేర్పులు ఉంటే చెబుతూ ఉంటాడట. తన అనుభవంతో చరణ్ కు మంచి కథలు ఎంపిక చేస్తున్న చిరంజీవి ‘రంగస్థలం’ విషయంలో మాత్రం పూర్తిగా దర్శకుడు సుకుమార్ కు నిర్ణయాధికారం వదిలేశాడు. రంగస్థలం చిత్రం కథలో మొదట చిరంజీవి మార్పులు చేర్పులు చెప్పాడని ప్రచారం జరిగింది. ఆ సీన్స్ బాగుంటాయని చిరంజీవిని కన్విన్స్ చేసి మరీ సుకుమార్ తాను అనుకున్నట్లుగా సినిమాను పూర్తి చేశాడు అంటున్నారు.
‘రంగస్థలం’ చిత్రం భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. దాంతో చరణ్ చిత్రాల విషయంలో మరీ ఇవ్వాల్వ్ మెంట్ అవసరం లేదని - మంచి దర్శకుల చేతిలో సినిమా పడితే తప్పకుండా బాగుంటుందనే నిర్ణయానికి చిరంజీవి వచ్చినట్లుగా తెలుస్తోంది. అందుకే చరణ్ ప్రస్తుతం చేస్తున్న బోయపాటి శ్రీను చిత్రం విషయంలో కూడా ఎక్కువ ఇన్వాల్వ్ మెంట్ లేదు. బోయపాటి రెడీ చేసిన స్క్రిప్ట్ ను విన్న చిరంజీవి మార్పులేవి చెప్పకుండానే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. సినిమా ప్రారంభం సమయంలో యాక్షన్ సీన్స్ ను కాస్త లిమిట్స్ తో చేయి అంటూ సలహా ఇవ్వడం జరిగిందట.
చిరంజీవి సలహా మేరకు అతి యాక్షన్ సీన్స్ లేకుండా - చరణ్ బాడీలాంగ్వేజ్ కు తగ్గట్లుగా - ఇమేజ్ కు తగ్గట్లుగా యాక్షన్ సీన్స్ ను కంపోజ్ చేయిస్తున్నట్లుగా తెలుస్తోంది. అజైర్ బైజాన్ లో ప్రస్తుతం రామ్ చరణ్ చిత్రం షూటింగ్ ను బోయపాటి నిర్వహిస్తున్నాడు. యాక్షన్ ఎపిసోడ్ తో పాటు కొన్ని ముఖ్యమైన సీన్స్ ను అక్కడ చిత్రీకరిస్తున్నట్లుగా తెలుస్తోంది. చిరు సలహా మేరకు దర్శకుడు బోయపాటి శ్రీను తన మార్క్ కు భిన్నంగా ఈ చిత్రంలో యాక్షన్ ఎపిసోడ్స్ ను లిమిట్స్ లో చేస్తున్నట్లుగా తెలుస్తోంది. వచ్చే సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రంలో హీరోయిన్ గా కియారా అద్వానీ నటిస్తోంది.