Begin typing your search above and press return to search.
ఆ వేడుకలో బోయపాటి వెర్సస్ యండమూరి
By: Tupaki Desk | 7 Nov 2016 1:00 PM ISTఆ మధ్య ‘లెజెండ్’ సినిమా సక్సెస్ మీట్లో బోయపాటి శ్రీనుకు.. దేవిశ్రీ ప్రసాద్ కు మధ్య జరిగిన సంభాషణ ఎంత వివాదాస్పదమైందో గుర్తుండే ఉంటుంది. అప్పుడు అందరూ బోయపాటి తీరునే తప్పుబట్టారు. తాజాగా ఓ వైపు పోసాని కృష్ణమురళి.. మరోవైపు కొరటాల శివ.. బోయపాటిని మీడియా ఇంటర్వ్యూల్లో వాయించేశారు. ఇవన్నీ చాలవన్నట్లు బోయపాటి ఇంకో చిన్న వివాదంలో చిక్కుకున్నాడు. తమిళ హీరో విజయ్ ఆంటోనీ కొత్త సినిమా ‘బేతాళుడు’ ఆడియో వేడుకలో భాగంగా లెజెండరీ రైటర్ యండమూరి వీరేంద్రనాథ్ ను తప్పుబడుతూ మాట్లాడటం చర్చనీయాంశం అవుతోంది.
ఈ ఆడియో వేడుకకు యండమూరి.. బోయపాటి అతిథులుగా హాజరయ్యారు. ముందు యండమూరి మాట్లాడుతూ.. విజయ్ ఆంటోనీ నటనను కొనియాడాడు. అతను సటిల్ పెర్ఫామన్స్ ఇస్తాడని.. తెలుగులో అలాంటి పెర్ఫామెన్స్ ఇచ్చేవాళ్లు కనిపించరని వ్యాఖ్యానించాడు. ఆ తర్వాత మైకు అందుకున్న బోయపాటి.. యండమూరికి కౌంటర్ ఇచ్చాడు. తెలుగులో కూడా మంచి నటులున్నారని.. రచయితలు.. దర్శకులు రొటీన్ సబ్జెక్టులు రాయడం వల్ల మన హీరోల టాలెంట్ బయటికి రావట్లేదని.. మంచి సబ్జెక్టులు వస్తే హీరోలు తమ యాక్టింగ్ టాలెంట్ చూపిస్తారని అన్నాడు. అంతా బాగానే ఉంది కానీ.. రొటీన్ మాస్ మసాలా సినిమాలు తీసే బోయపాటే హీరోల్ని వెనకేసుకుని వస్తూ దర్శకులు.. రచయితల్ని తప్పుబట్టడమే విడ్డూరం.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/