Begin typing your search above and press return to search.

చెర్రీనే సరైనోడు అంటున్న బోయపాటి

By:  Tupaki Desk   |   29 Aug 2017 11:32 AM IST
చెర్రీనే సరైనోడు అంటున్న బోయపాటి
X
దర్శకుడు బోయపాటి శ్రీను రీసెంట్ మూవీ జయ జానకి నాయక. ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఒకే సారి మూడు సినిమాలు విడుదల కాగా.. అన్నిటిలోకి టాక్ బాగా వచ్చిన సినిమా ఇదే. కానీ ఈ మూవీ టాప్ లో నిలబడలేకపోవడానికి అనేక కారణాలు ఉన్నాయి. థియేటర్ల నుంచి హీరో రేంజ్ వరకూ ఇందుకు రీజన్స్ గా చెప్పచ్చు. అయితే.. బెల్లంకొండ శ్రీనివాస్ లాంటి చిన్న హీరోతో మాస్ సినిమా తీసి కూడా 25+ కోట్ల థియేట్రికల్ కలెక్షన్స్ రాబట్టడం అంటేనే బోయపాటి స్టామినా అర్ధమవుతుంది.

అందుకే తన మరుసటి మూవీ విషయంలో ఓ స్ట్రాంగ్ డెసిషన్ కు వచ్చేశాడట బోయపాటి. ఇప్పటికే స్టోరీ కూడా దాదాపు సిద్ధమైపోయిందనే టాక్ ఉంది. ఇంతకీ బోయపాటి ఎంచుకున్న హీరో ఎవరో కాదు.. రామ్ చరణ్ కావడం హైలైట్. చెర్రీతో బోయపాటి శ్రీను సినిమాపై త్వరలోనే ఓ అధికారిక ప్రకటన కూడా వచ్చేయచ్చని అంటున్నారు. రామ్ చరణ్- బోయపాటి కాంబినేషన్ లో రూపొందే తొలి చిత్రం కావడంతో.. ఇండస్ట్రీ వర్గాల్లో ఆసక్తి కూడా నెలకొంది. మరోవైపు ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ బ్యానర్ పై రామ్ చరణ్ మామయ్య అల్లు అరవింద్ నిర్మించనుండడం విశేషం.

గతంలో గీతా ఆర్ట్స్ బ్యానర్ పై సరైనోడు చిత్రం నిర్మించాడు బోయపాటి. ఆ సమయానికి ఇండస్ట్రీ హిట్స్ లో ఒకటిగా నిలిచిన తర్వాత.. మరొక ప్రాజెక్ట్ కలిసి చేయాలని దర్శక నిర్మాతలు ఓ ఒప్పందానికి వచ్చారు. ఇప్పుడు ఆ ప్రాజెక్టు సాకారం కాబోతోంది. సుకుమార్ దర్శకత్వంలో ప్రస్తుతం రంగస్థలం 1985 ను షూటింగ్ లో ఉన్న రామ్ చరణ్.. అది పూర్తి కాగానే.. బోయపాటి ప్రాజెక్టును పట్టాలెక్కించే పనిలో పడతాడట.