Begin typing your search above and press return to search.

బోయ‌పాటి కోసం చిరు వెయిట్ చేయాల్సిందే?

By:  Tupaki Desk   |   1 July 2017 7:02 PM IST
బోయ‌పాటి కోసం చిరు వెయిట్ చేయాల్సిందే?
X
టాలీవుడ్ లో వ‌రుస హిట్ల‌తో దూసుకుపోతున్న ద‌ర్శ‌కుడు బోయ‌పాటి శీను. ఆయ‌న సినిమాకు సినిమాకు మధ్య గ్యాప్ తీసుకునే స్టార్ డైరెక్టర్ల జాబితాలో చేరిపోయాడు. కొత్త సినిమాకు ముందు ఆరు నెలలైనా స్క్రిప్టు పని కోసం వెచ్చిస్తాడు బోయపాటి. షూటింగ్ కూడా నెమ్మ‌దిగా ఉండ‌డంతో 12 ఏళ్ల వ్యవధిలో 6 సినిమాలే చేయగలిగాడు. బోయ‌పాటి ఏడో సినిమా 'జయ జానకి నాయకస త్వ‌ర‌లో విడుదల కానుంది..

ఈ చిత్రం తర్వాత బోయపాటి - మెగాస్టార్ చిరంజీవి కాంబినేష‌న్‌ లో ఓ చిత్రం రానుంది. వచ్చే ఏడాది ఆరంభంలోనే ఈ త్రం సెట్స్ మీదికి వెళ్లాల్సింది. అయితే, చిరు 'ఉయ్యాలవాడ నరసింహారెడ్డి షూటింగ్ సుదీర్ఘంగా జరిగే అవకాశముంది. దీంతో చిరు కోసం కనీసం ఏడాదైనా బోయపాటి ఎదురు చూడాల్సి వచ్చేట్లుంది.

ఈ విష‌యాన్ని గ‌మ‌నించిన నాగార్జున అఖిల్ హీరోగా సినిమా చేసేందుకు బోయపాటిని ఒప్పించాడు. అందుకోసం బోయపాటికి రూ.12 కోట్ల దాకా పారితోషకం ఇవ్వబోతున్నార‌నే పుకార్లు వ‌స్తున్న‌ సంగతి తెలిసిందే. 'జయ జానకి నాయక' నుంచి ఇంకో నెల రోజుల్లో బయటపడనున్న బోయపాటి అఖిల్ రెడీ అయ్యే సమయానికి స్క్రిప్టుతో సిద్ధంగా ఉంటాడు.

వచ్చే ఏడాది ఆరంభంలో ఈ సినిమా మొదలవుతుంది. ఇది పూర్తయి విడుదలకు సిద్ధం కావడానికి వచ్చే ఏడాది చివరి వరకు సమయం పట్టొచ్చేమో. అప్పటికి చిరునే ఫ్రీ అయిపోయి బోయపాటి కోసం ఎదురు చూస్తుండొచ్చు. మొత్తానికి చిరు కోసం బోయపాటి ఎదురు చూడటం కాదు.. బోయపాటి కోసమే చిరు వెయిట్ చేసే పరిస్థితి ఉంటుందన్నమాట.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/