Begin typing your search above and press return to search.

పవన్-బోయపాటి.. కుదురుతుందా?

By:  Tupaki Desk   |   6 Sept 2016 1:00 AM IST
పవన్-బోయపాటి.. కుదురుతుందా?
X
బోయపాటి సినిమాలంటే ఒక టైపు. పవన్ కళ్యాణ్ సినిమాలు అందుకు పూర్తి భిన్నంగా ఉంటాయి. వీళ్లిద్దరికీ లంకె కుదురుతుందని ఎవ్వరూ అనుకోరు. ఐతే దర్శక రత్న దాసరి నారాయణ రావు మాత్రం వాళ్లిద్దరినీ ఒక తాటిపైకి తేవాలని ప్రయత్నిస్తున్నాడట. దాసరి నిర్మాణంలో పవన్ ఓ సినిమా చేయడానికి పవన్ కమిట్మెంట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ ప్రకటన వచ్చి ఏడాదిన్నర దాటింది. కానీ ఇప్పటిదాక ఒక్క అడుగూ ముందుకు పడలేదు. దీని కంటే ముందు పవన్ చేయాల్సిన సినిమాలే ఎటూ తేలకుండా ఉన్నాయి. ఓ దశలో ఈ కాంబినేషన్లో సినిమా ఉండదేమో అనుకున్నారు కానీ.. మొన్న పవన్ పుట్టిన రోజుకు దాసరి యాడ్ ఇచ్చి.. ‘తారకప్రభు ఫిలిమ్స్’ ప్రొడక్షన్ నెంబ.38గా పవన్ సినిమా ఉంటుందని స్పష్టం చేశారు. ఐతే దీనికి దర్శకుడెవరన్నదే తేలకుండా ఉంది.

ఓ దశలో డాలీని అనుకున్నారు కానీ.. అతను ‘కాటమరాయుడు’ చేస్తున్నాడు. మళ్లీ అతడితోనే పవన్ చేసే అవకాశాలు లేవు. త్రివిక్రమ్‌ తో అనుకున్నారు కానీ.. అతను హారిక హాసిని క్రియేషన్స్ లో పవన్ తోనే సినిమా చేయబోతున్నాడు. మరే పెద్ద దర్శకుడూ ఖాళీగా లేడు. ఐతే ప్రస్తుతం బెల్లంకొండ శ్రీనివాస్ తో సినిమా చేస్తున్న బోయపాటిని.. తర్వాతి సినిమా పవన్ తో చేయమని అడుగుతున్నారట దాసరి. బోయపాటి కూడా సుముఖంగానే ఉన్నాడు కానీ.. పవన్ అతడిత సినిమా చేయడానికి ఒప్పుకుంటాడా అన్నదే డౌటు. ఎందుకంటే పవన్ బోయపాటి స్టయిల్లో ఊర మాస్ సినిమాలు ఎప్పుడూ చేయలేదు. ఆ స్టయిల్ పవన్ కు నప్పుతుందా అనేది డౌట్. పవన్ గ్రీన్ సిగ్నల్ ఇస్తాడా లేదా అన్నదానిపై ఈ కాంబినేషన్ ఆధార పడి ఉంది.