Begin typing your search above and press return to search.

బన్నీ బాటలో మహేష్

By:  Tupaki Desk   |   4 July 2017 12:43 PM IST
బన్నీ బాటలో మహేష్
X
కొందరు హీరోలు కెరీర్ ఆరంభం నుంచే మాస్ ఇమేజ్ మీద దృష్టిపెడతారు. తర్వాత అదే ఇమేజ్ బిల్డప్ అవుతుంది. కొందరు ఆరంభంలో చేసిన సినిమాల కారణంగా క్లాస్ ముద్ర పడిపోతుంది. ఎంత పెద్ద స్టార్లుగా ఎదిగినప్పటికీ.. మాస్ ప్రేక్షకులకు.. వాళ్లు మధ్య కొంచెం అంతరం ఉంటుంది. మహేష్ బాబు.. అల్లు అర్జున్ ఈ కోవలోకే వస్తారు. వీళ్లు పెద్ద స్టార్లే. క్లాస్ తో పాటు మాస్ లోనూ మంచి ఫాలోయింగే ఉంది. కానీ వీళ్లు ఊర మాస్ ప్రేక్షకుల్లోకి పూర్తిగా వెళ్లలేదు. తాము ఎంచుకునే సినిమాల కారణంగా వేరే కొందరు హీరోలతో పోలిస్తే ఆ వర్గం ప్రేక్షకులకు కొంచెం దూరంగానే ఉంటున్నారు. ఐతే కొంచెం ఇమేజ్ మార్చుకోవాలని.. ఊర మాస్ ప్రేక్షకుల్లోనూ ఫాలోయింగ్ పెంచుకోవాలనే ఉద్దేశంతో అల్లు అర్జున్.. బోయపాటితో ‘సరైనోడు’ సినిమా చేశాడు. అది మంచి ఫలితమే ఇచ్చింది.

ఇప్పుడు మహేష్ బాబు కూడా ఈ బాటలోనే నడుస్తున్నట్లు సమాచారం. మహేష్.. స్టార్ డైరెక్టర్లతో చేశాడు కానీ.. వినాయక్.. బోయపాటి లాంటి ఊర మాస్ డైరెక్టర్లతో పని చేయలేదు. వినాయక్-మహేష్ కాంబినేషన్ గురించి చాలాసార్లు ఊహాగానాలు వినిపించాయి కానీ.. అది కార్యరూపం దాల్చలేదు. ఐతే బోయపాటితో మహేష్ కాంబో మాత్రం వర్కవుట్ కాబోతోందని అంటున్నారు. బోయపాటి ఇటీవలే మహేష్ బాబుకు ఓ లైన్ వినిపించి.. గ్రీన్ సిగ్నల్ అందుకున్నాడని.. వీళ్లిద్దరూ కొంచెం విరామం తర్వాత కలిసి పని చేసే అవకాశాలున్నాయని అంటున్నారు. ప్రస్తుతం కొరటాల శివతో సినిమా చేస్తున్న మహేష్.. ఆపై వంశీ పైడిపల్లి ప్రాజెక్టు మీదికెళ్తాడు. అదయ్యాక కానీ.. లేదా త్రివిక్రమ్ తో కమిట్మెంట్ కూడా పూర్తయ్యాక కానీ.. బోయపాటితో సినిమా చేసే అవకాశముందట. చిరంజీవితో చేయాల్సిన సినిమా ఎప్పుడు ఉంటుందన్నదాన్ని బట్టి మహేష్ సినిమాకు ప్లానింగ్ చేసుకోవాలని చూస్తున్నాడు బోయపాటి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/