Begin typing your search above and press return to search.

గ్యాంగ్ లీడర్ అవతారంలో చరణ్‌

By:  Tupaki Desk   |   6 April 2018 11:01 PM IST
గ్యాంగ్ లీడర్ అవతారంలో చరణ్‌
X
యాక్షన్ దర్శకుడితో సినిమా చేస్తే ఎలాంటి హీరో రేంజ్ ఆయినా పెరిగిపోతుంది. ఇక ఆ దర్శకుడితో యాక్షన్ హీరోనే చేస్తే ఎలా ఉంటుందో మనం ఉహించుకోగలం. ఒక్కసారిగా ఊహలు చాలా పెరిగిపోతాయి. దీంతో దర్శకుడు హీరో కూడా బాధ్యతతో ఆడియెన్స్ ని నిరాశ చెందనివ్వకూడదు అని మంచి అవుట్ ఫుట్ కోసం ట్రై చేస్తారు. రొటీన్ కథ అయినా సరే కొత్తగా చూపించాలి. ప్రస్తుతం వస్తోన్న కథలు చాలా వరకు అలాంటివే.

కానీ దర్శకుల మ్యాజిక్ వల్ల సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ రాబడుతున్నాయి. అసలు మ్యాటర్ లోకి వెళితే.. బోయపాటి శ్రీను - మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్ మొదటి సారి కలుస్తుండడంతో మాస్ ఆడియెన్స్ ఖుషి అయిన సంగతి తెలిసిందే. అసలే రంగస్థలం సినిమాతో చెర్రీ రేంజ్ మరింత పెరిగింది. ఇక ఆ ప్రాజెక్ట్ విషయానికి వస్తే.. కథ కొంచెం రొటీన్ గానే ఉన్నా బోయపటి మార్క్ లో సినిమా ఉంటుందట. రంగస్థలం సినిమాలో బ్రదర్స్ సెంటిమెంట్ ఏ రేంజ్ లో ఉందో తెలిసిందే. అయితే అదే తరహాలో బోయపాటి ప్రాజెక్ట్ లో కూడా ఉంటుందట.

కాకపోతే చరణ్ కు ఇక్కడ ముగ్గురు అన్నయ్యలంట. వారు ఎవరో తెలిస్తే షాక్ అవుతారు. కోలీవుడ్ హీరో ప్రశాంత్ - నవీన్ చంద్ర - ఇవివి సత్యనారాయణ పెద్ద కుమారుడు - అల్లరి నరేష్ అన్నయ్య ఆర్యన్ రాజేష్. గత కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న ఈ హీరో చరణ్ సినిమాతో రీ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు టాక్. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియదు గాని దాదాపు కథ గ్యాంగ్ లీడర్ తరహాలో ఉంటుందని టాక్.