Begin typing your search above and press return to search.

బాస్ మాస్ ని బోయపాటి వెనక్కి తీసుకొస్తాడా?

By:  Tupaki Desk   |   12 April 2016 5:00 PM IST
బాస్ మాస్ ని బోయపాటి వెనక్కి తీసుకొస్తాడా?
X
కధనాయకుడిని బట్టి పాత్రని, పాత్రని బట్టి కదాకధనాలను రాసుకునే దర్శకుడు బోయపాటి శ్రీను. టిపికల్ ఫిల్మ్ రైటింగ్ కి ఇది విరుద్దమే అయినా బోయపాటి ఈ ఫార్మాట్ లో బాగానే సక్సెస్ అయ్యాడు. ప్రస్తుతం సరైనోడు సినిమా పనుల్లో బిజీగా వున్న బోయపాటికి బంపర్ ఆఫర్ దొరికిందనే చెప్పాలి.

ఇటీవల ఈ సినిమా పాటల విజయోత్సవ సభలో నా 151వ సినిమాకు అల్లు అరవింద్ కి ఒక లైన్ బోయపాటి చెప్పినట్టు, ఇలాంటి మాస్ డైరెక్టర్ తో పనిచెయ్యడం నాలాంటి మాస్ హీరోకి చాలా ఇష్టమని దానిమీద వర్క్ అవుట్ చెయ్యమని చిరంజీవి సభాముఖంగా సూచించారు.

చిరు 150వ సినిమా(కత్తి రీమేక్)లో ఎన్ని అమర్పులు చేసినా అదోక సోషల్ సబ్జెక్ట్ - హీరోయిజం వున్నా - పక్కా మాస్ చిత్రం కాదు. అయితే చిరుని బిగ్ బాస్ గా నిలబెట్టిన ఆ మాస్ రోల్స్ ని బోయపాటి తన కధాకధనాలతో తిరిగి రప్పించగలిగితే అభిమానులకు అంతకుమించిన పండుగేముంటుంది చెప్పండి?