Begin typing your search above and press return to search.

మళ్ళీ అతడికి బోయపాటి మేకోవర్!!

By:  Tupaki Desk   |   14 Dec 2016 9:14 AM IST
మళ్ళీ అతడికి బోయపాటి మేకోవర్!!
X
అందగాడైన ఫ్యామిలీ హీరో ఇమేజ్ ఉన్న జగపతి బాబుని.. లెజెండ్ మూవీతో క్రూరమైన విలన్ గా మార్చేశాడు బోయపాటి శ్రీను. అక్కడి నుంచి జగపతి కెరీర్ ఏ రేంజ్ లో టర్నింగ్ ఇచ్చుకుందో చెప్పాల్సిన పని లేదు. సౌత్ మొత్తం నుంచి ఆఫర్స్ కుప్పలు తెప్పలుగా వచ్చేస్తున్నాయి. హీరోగా కూడా ఎన్నడూ లేనంత బిజీగా.. స్టార్ విలన్ రేంజ్ కి చేరిపోయాడు జేబీ.

ఇప్పుడు మరోసారి జగపతిబాబుతో కీలక పాత్ర చేయిస్తున్నాడు బోయపాటి. బెల్లంకొండ శ్రీనివాస్ తో బోయపాటి తెరకెక్కిస్తున్న చిత్రంలో జగపతి ఓ సూపర్బ్ రోల్ చేస్తున్నాడని తెలుస్తోంది. ఈ పాత్ర కోసం మరోసారి కంప్లీట్ మేకోవర్ చేశాడట ఈ స్టైలిష్ విలన్. ఇది పాజిటివ్ పాత్రా.. నెగిటివ్ రోలా అనే విషయంలో ఇంకా క్లారిటీ లేదు కానీ.. ఇప్పటికే జగపతిబాబుతో షూటింగ్ కూడా మొదలుపెట్టేశాడట. ప్రస్తుతం వైజాగ్ లో కీలకమైన సన్నివేశాల చిత్రీకరణ జరిపేస్తున్నారు కూడా.

జగపతి.. బెల్లంకొండ.. ప్రగ్యా జైస్వాల్ లపై కీలక షెడ్యూల్ షూటింగ్ జరుగుతోంది. ఈ మూవీలో తమిళ సీనియర్ హీరో శరత్ కుమార్ ఫుల్ ప్లెడ్జెడ్ రోల్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు జగపతి బాబు ఎంట్రీతో.. ఈ మూవీకి మరింత వాల్యూ తోడయినట్లే


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/