Begin typing your search above and press return to search.

ఫస్ట్ లుక్ః షాకిచ్చిన బోయపాటి టైటిల్

By:  Tupaki Desk   |   16 Jun 2017 9:55 AM GMT
ఫస్ట్ లుక్ః షాకిచ్చిన బోయపాటి టైటిల్
X
ఇప్పటివరకు బోయపాటి శ్రీను తీసిన సినిమాలు ఏవి తీసుకున్నా కూడా.. వాటిలో రక్తార్ఫణం అనే కోనం స్పష్టంగా కనబడుతుంది. అదేనండీ మనోడు వయలెన్స్ లేకుండా హీరోయిజం కనిపించకుండా ఒక్క సినిమా కూడా తీయడుగా. అందుకే భద్ర.. తులసి.. సింహా.. లెజండ్.. దమ్ము.. సరైనోడు వంటి టైటిల్స్ తో వచ్చాడు. అయితే ఇప్పుడు మాత్రం ఎవ్వరీ ఊహకీ అందని ఒక టైటిల్ తో వచ్చేసి.. పెద్ద షాకే ఇచ్చాడు.

''జయ జానకి నాయక''అనే టైటిల్ ఇప్పుడు బోయపాటి తన తదుపరి సినిమాకు పెట్టేశాడు తెలుసా. పైన మీరు లోగో చూస్తున్నారుగా.. బెల్లంకొండ్ శ్రీనివాస్ హీరోగా రూపొందుతున్న సినిమాకు ఈ పేరు పెట్టారు. ఎప్పుడు రక్తపాతాలతో వణికించే బోయపాటి.. ఇప్పుడు మాత్రం.. 'శ్రీరామరాజ్యం' సినిమాలోని సూపర్ హిట్ సాంగ్ అయిన 'జగదానంద కారక.. జయ జానకి ప్రాణ నాయక' పాటలోని లిరిక్ తీసుకుని.. ఇక్కడ బెల్లంకొండ శ్రీనివాస్ ను ఒక రాముడ్ని చేసేశాడు. అసలు తీస్తున్న సినిమా ఏంటో.. ఈ టైటిలేంటో అంటూ అందరూ షాకైపోయారు అంతే.

సడన్ గా రాజమౌళి ఒక బాలల చిత్రం తీస్తున్నానని.. పూరి జగన్ ఒక డివోషనల్ సినిమా తీస్తున్నానని.. రామ్ గోపాల్ వర్మ ఒక సూపర్ హిట్ తీస్తున్నాను అని చెబితే ఆడియన్స్ షాకైపోతారో.. ఇప్పుడు కూడా బోయపాటి కొత్త టైటిల్ చూసి అంతే షాకవుతున్నారు. మరి ఈ టైటిల్ వెనుకున్న ఆ మ్యాజిక్ అండ్ లాజిక్ ఏంటో ఆయనే చెప్పాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/