Begin typing your search above and press return to search.
ప్లాన్ మార్చుకుంటున్న బోయపాటి
By: Tupaki Desk | 28 April 2019 12:13 PM ISTవినయ విధేయ రామ దారుణంగా దెబ్బ తినడం బోయపాటిని రెండు రకాలుగా డ్యామేజ్ చేసింది. ఒకటి అతని క్యాలిబర్ మీద డౌట్ వచ్చేలా చేయడం. రెండు దానికన్నా ముందే కమిట్ అయిన బాలయ్య తనది వాయిదా వేసి కెఎస్ రవికుమార్ కు ఛాన్స్ ఇవ్వడం. ఒకవేళ రామ్ చరణ్ సినిమా బ్లాక్ బస్టర్ అయ్యుంటే ఖచ్చితంగా ఇప్పుడు ఈ న్యూస్ ఇంకోలా ఉండేది.
పైగా భారీ బడ్జెట్ లతో బోయపాటితో రిస్క్ చేయాలంటే ఇప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించాల్సిన పరిస్థితి వచ్చింది. దీంతో పూర్తిగా డిఫెన్స్ లో పడిన బోయపాటి శీను మరో కొత్త మార్గం వెతికే ఆలోచనలో ఉన్నాడట. అంటే బాలయ్య-రవికుమార్ ల సినిమా పూర్తయ్యే లోపు తాను వేరే హీరోతో ఇంకో ప్రాజెక్ట్ పూర్తి చేసే ఆలోచన చేస్తున్నట్టుగా ఇన్ సైడ్ టాక్. అయితే హీరో ఎవరైనా కనీసం ఏడాదిన్నర నుంచి రెండేళ్ళ టైం తీసుకునే బోయపాటి నిజంగా ఇలా చేయగలడా అనే అనుమానం వ్యక్తమవుతోంది
సో బోయపాటి ఇప్పుడు ఈ సవాల్ ని ఎలా దాటుతాడో వేచి చూడాలి. బాలకృష్ణకు నచ్చే కథ రాసుకోవాలి. ఆలోపే తానేంటో ప్రూవ్ చేసుకోవాలి అంటే మీడియం రేంజ్ హీరో ఎవరితోనైనా ఈజీ బడ్జెట్ లో పవర్ ఫుల్ సబ్జెక్టుతో ఓ హిట్టు కట్టాలి. దాంతో సమాంతరంగా బాలయ్యకు స్క్రిప్ట్ రెడీ చేయాలి. ఇలా రెండు పడవల మీద ప్రయాణం అంత ఈజీగా ఉండదు.
పోనీ ఈ విషయం గురించి నేరుగా అడుగుదాం అంటే వినయ విదేయ రామ తర్వాత బోయపాటి శీను బయట కనిపిస్తే ఒట్టు. ఇతర హీరోల దర్శకుల సినిమా వేడుకలకు వచ్చిన దాఖలాలు కూడా లేవు. స్క్రిప్ట్ పనుల్లో బిజీగా ఉన్నాడని సన్నిహితుల మాట. అనిశ్చితికి మారుపేరైన పరిశ్రమలో ఎప్పుడు ఎవరు ఏ నిర్ణయం తీసుకుంటారో చెప్పడం కష్టమే