Begin typing your search above and press return to search.
చిరుతో చూద్దాం.. బన్నీతో మళ్లీ చేస్తా-బోయపాటి
By: Tupaki Desk | 25 April 2016 11:00 PM ISTఅల్లు అర్జున్ తో ‘సరైనోడు’ తీసి కెరీర్ లో మరో కమర్షియల్ సక్సెస్ ఖాతాలో వేసుకున్నాడు బోయపాటి శ్రీను. సోమవారం పుట్టిన రోజు చేసుకుంటున్న బోయపాటి.. ‘సరైనోడు’ సక్సెస్ తనకు బర్త్ డే గిఫ్ట్ లాంటిదని చెప్పాడు. తన తర్వాతి సినిమా బెల్లంకొండ శ్రీనివాస్ తోనే ఉంటుందన్న బోయపాటి.. దాని తర్వాత మళ్లీ బన్నీతోనే ఇంకో సినిమా చేయబోతున్నట్లు వెల్లడించాడు. చిరంజీవితో సినిమా చేస్తానా లేదా అన్నది తన చేతుల్లో లేదన్నాడు.
‘‘బెల్లంకొండ శ్రీనివాస్ తో సినిమా చేస్తానని మాటిచ్చాను. నా తర్వాతి సినిమా అతడితోనే ఉంటుంది. దాని తర్వాత బన్నీతో మళ్లీ ఇంకో సినిమా చేయబోతున్నా. చిరంజీవితో సినిమా చేస్తానా లేదా అన్నది నా చేతుల్లో లేదు. అవకాశమిస్తే ఆయన్ని డీల్ చేయగలనన్న నమ్మకం నాకుంది. ఆయనతో సినిమా చేస్తానో లేదో చూడాలి’’ అని బోయపాటి అన్నాడు.
సరైనోడు సినిమాకు డివైడ్ టాక్ రావడం గురించి చెబుతూ.. ‘‘ఇండస్ట్రీ జనాలు సినిమా చూసి పెదవి విరిచిన మాట వాస్తవం. కానీ ప్రేక్షకులదే అంతిమ తీర్పు అని నేను భావిస్తాను. అన్ని చోట్లా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. కలెక్షన్లు తిరుగులేని విధంగా ఉన్నాయి. సినిమాను కొందరు విమర్శిస్తే.. ఇంకొందరు ‘ప్రేక్షకులకు ఏం కావాలో అదిచ్చారు. సినిమా బాగుంది’ అని కాంప్లిమెంట్స్ ఇచ్చారు. చిరంజీవి గారితో పాటు పూరి జగన్నాథ్.. వి.వి.వినాయక్ లాంటి వాళ్లు సినిమాను మెచ్చుకున్నారు’’ అని బోయపాటి చెప్పాడు.