Begin typing your search above and press return to search.

మెగా హీరోతో బోయపాటి నెక్స్ట్ మూవీ

By:  Tupaki Desk   |   12 Feb 2021 4:00 PM IST
మెగా హీరోతో బోయపాటి నెక్స్ట్ మూవీ
X
టాలీవుడ్ తెరపై యాక్షన్ ఎపిసోడ్స్ ను మరోస్థాయికి తీసుకెళ్లిన దర్శకుడిగా బోయపాటి కనిపిస్తాడు. ఆయన సినిమాల్లో యాక్షన్ .. ఎమోషన్ రెండూ ఉంటాయి. అయితే యాక్షన్ ఎపిసోడ్స్ విషయానికి వస్తే, అభిమానులకు పూనకాలు తెప్పించే స్థాయికి తీసుకెళతాడు. ఇంట్రడక్షన్ నుంచి శుభం కార్డువరకూ ఎక్కడా కూడా ఆయన హీరోయిజాన్ని తగ్గనీయడు. అందువలన బోయపాటి సినిమాలకు మాస్ ఆడియన్స్ ఆదరణ ఎక్కువ. అలాగే యాక్షన్ సినిమాలను ఎక్కువగా ఇష్టపడేవారు కూడా ఆయన సినిమాలను వదలకుండా చూస్తుంటారు.

ప్రస్తుతం బోయపాటి .. బాలకృష్ణతో ఒక సినిమా చేస్తున్నాడు. గతంలో వచ్చిన 'సింహా' .. 'లెజెండ్' హిట్ కొట్టగా, ఈ ఇద్దరి కాంబినేషన్లో ఇప్పుడు వస్తున్నది మూడో సినిమా. ఈ సినిమాకి 'మోనార్క్' అనే టైటిల్ ను ఫిక్స్ చేసినట్టుగా తెలుస్తోంది. ఆ తరువాత సినిమాను ఆయన సాయిధరమ్ తేజ్ తో చేయనున్నట్టుగా చెబుతున్నారు. లాక్ డౌన్ సమయంలో బోయపాటి ఒక కథను రెడీ చేసుకున్నాడట. ఆ కథను సాయిధరమ్ తేజ్ కి వినిపించగా ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా చెబుతున్నారు. యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా రూపొందనుందని అంటున్నారు.

అయితే ప్రస్తుతం సాయిధరమ్ తేజ్ .. దేవ కట్టా దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. పొలిటికల్ టచ్ తో కూడిన కథతో ఈ సినిమా నడుస్తుంది. ఈ సినిమా తరువాత సుకుమార్ సొంత బ్యానర్లో సాయిధరమ్ తేజ్ ఒక సినిమా చేయనున్నాడు. అందుకు సంబంధించిన సన్నాహాలు కూడా మొదలైపోయాయి. ఈ రెండు సినిమాలు పూర్తయిన తరువాత, బోయపాటితో కలిసి సాయిధరమ్ తేజ్ సెట్స్ పైకి వెళ్లనున్నట్టు చెబుతున్నారు. ఈ సినిమాలో కథానాయికగా ప్రియాంక అరుళ్ మోహన్ ను తీసుకునే అవకాశాలు ఉన్నాయనే ఊహాగానాలు ఫిల్మ్ నగర్లో వినిపిస్తున్నాయి.