Begin typing your search above and press return to search.

BB3 కోసం క్రియేటివ్‌ డైరెక్టర్‌ ఓల్డ్‌ టైటిల్‌

By:  Tupaki Desk   |   16 Aug 2020 2:20 PM IST
BB3 కోసం క్రియేటివ్‌ డైరెక్టర్‌ ఓల్డ్‌ టైటిల్‌
X
నందమూరి బాలకృష్ణ మరియు బోయపాటిల కాంబోలో ఇప్పటికే వచ్చిన సింహా మరియు లెజెండ్‌ చిత్రాలు భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాయి. కనుక వీరి కాంబోలో హ్యాట్రిక్‌ కోసం ఫ్యాన్స్‌ మరియు ప్రేక్షకులు చాలా కాంగా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎట్టకేలకు వీరి కాంబో మూవీ పట్టాలెక్కింది. బిబి3 అంటూ రూపొందుతున్న ఈ సినిమాకు టైటిల్‌ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. కాని అనేక టైటిల్స్‌ మాత్రం ప్రచారం జరుగుతున్నాయి.

సోషల్‌ మీడియాలో ఈ సినిమాకు మోనార్క్‌ అనే టైటిల్‌ ను పరిశీలిస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి. ఇప్పుడు మరో టైటిల్‌ ప్రచారం జరుగుతోంది. బాలయ్య మాస్‌ ఇమేజ్‌ కు డేంజర్‌ అనే టైటిల్‌ అయితే బాగుంటుందని అభిప్రాయం వ్యక్తం అవుతుంది. అందుకే బోయపాటి ఆ టైటిల్‌కు ఆసక్తి చూపిస్తున్నట్లుగా తెలుస్తోంది. క్రియేటివ్‌ డైరెక్టర్‌ కృష్ణ వంశీ దర్శకత్వంలో అల్లరి నరేష్‌ సాయి రామ్‌ శంకర్‌ మరియు స్వాతిలు నటించిన చిత్రం డేంజర్‌ టైటిల్‌ తో వచ్చింది. అయితే ఆ సినిమా వచ్చి చాలా ఏళ్లు అయ్యింది.

ఆ సినిమా పెద్దగా ఆకట్టుకోలేదు కనుక టైటిల్‌ ను బాలయ్యకు ఉపయోగించడం వల్ల వచ్చే నష్టం ఏమీ లేదని ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కనుక బోయపాటి ఆ టైటిల్‌ ను దాదాపుగా ఫైనల్‌ చేసినట్లే అంటూ చిత్ర యూనిట్‌ సభ్యుల ద్వారా తెలుస్తోంది. దాదాపుగా సగం షూటింగ్‌ పూర్తి అయిన ఈ సినిమా కరోనా కారణంగా నిలిచి పోయింది. ఈ ఏడాది చివరి వరకు ప్రారంభించి వచ్చే ఏడాది సమ్మర్‌ లో విడుదల చేసే అవకాశం ఉందని అంటున్నారు.