Begin typing your search above and press return to search.

తీవ్ర ఒత్తిడి మద్య మొదలైన బాలయ్య బోయపాటి సినిమా

By:  Tupaki Desk   |   2 March 2020 3:30 PM GMT
తీవ్ర ఒత్తిడి మద్య మొదలైన బాలయ్య బోయపాటి సినిమా
X
నందమూరి బాలకృష్ణ తన నూరవ సినిమా గౌతమి పుత్ర శాతకర్ణి తర్వాత ఇప్పటి వరకు సక్సెస్‌ అనేది ఎరుగలేదు. అంతకు ముందు కూడా వరుసగా ఫ్లాప్స్‌ నే చవిచూస్తూ వస్తున్నాడు. రూలర్‌ తో ఇటీవల కూడా మరో డిజాస్టర్‌ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఔట్‌ డేటెడ్‌ దర్శకులతో వరుసగా సినిమాలు చేస్తున్నాడు అంటూ విమర్శలు ఎదుర్కొంటున్న బాలయ్య ప్రస్తుతం బోయపాటి తో జత కట్టిన విషయం తెల్సిందే. బోయపాటి కూడా ప్రస్తుతం చాలా గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నాడు.

ఒకే ఒక్క సినిమా ‘వినయ విధేయ రామ’తో బోయపాటి క్రేజ్‌ చాలా తగ్గింది. అంతకు ముందు ఆయన సినిమాలు బ్లాక్‌ బస్టర్‌ సక్సెస్‌ అయ్యాయి. కాని ఇప్పుడు బోయపాటితో సినిమా అంటేనే హీరోలు మరియు ప్రేక్షకులు భయపడే పరిస్థితి ఉంది. ఇలాంటి సమయంలో బాలయ్య మరియు బోయపాటిలు కలిసి సినిమా చేస్తున్నారు. ఈ చిత్రం ఇద్దరికి కూడా చాలా కీలకం. వీరిద్దరి కాంబోలో ఇది హ్యాట్రిక్‌ గా నిలుస్తుందని ఫ్యాన్స్‌ చాలా నమ్మకంతో ఉన్నారు.

సింహా మరియు లెజెండ్‌ సినిమాల రేంజ్‌ లో ఈ సినిమా ఉంటుందా అనేది ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. గతంలో వీరిద్దరు సినిమాలు చేసి సక్సెస్‌ లు దక్కించుకున్నా ఇప్పుడు మాత్రం హ్యాట్రిక్‌ కొట్టాలి అంటే అంత ఈజీ మాత్రం కాదని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సినిమా హిట్‌ అవ్వాల్సిందే అంటూ తీవ్ర ఒత్తిడి చిత్ర యూనిట్‌ సభ్యులపై ఉంది.

ఇంతటి ఒత్తిడి మద్య ఎట్టకేలకు సినిమా ప్రారంభం అయ్యింది. రామోజీ ఫిల్మ్‌ సిటీలో కీలక యాక్షన్‌ ఎపిసోడ్స్‌ ను చిత్రీకరిస్తున్నారు. రామ్‌ లక్ష్మణ్‌ మాస్టర్స్‌ ఈ యాక్షన్‌ సీన్స్‌ ను కంపోజ్‌ చేశారు. సినిమా ఎట్టకేలకు షూటింగ్‌ ప్రారంభం అవ్వడం తో ఖచ్చితం గా దసరాకు ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉందని నందమూరి ఫ్యాన్స్‌ నమ్మకం గా ఉన్నారు.