Begin typing your search above and press return to search.

కుమారికి బాయ్‌ ఫ్రెండ్లను ఫిక్స్ చేశారు

By:  Tupaki Desk   |   8 April 2016 10:58 AM GMT
కుమారికి బాయ్‌ ఫ్రెండ్లను ఫిక్స్ చేశారు
X
వివి వినాయక్‌ దగ్గర అసిస్టెంట్‌ గా పనిచేసిన భాస్కర్‌ బండి డైరక్షన్‌లో ఇప్పుడు 'కుమారి 21 ఎఫ్‌' ఫేమ్‌ హెబ్బా పటేల్‌ మరో ఉమెన్‌ సెంట్రిక్‌ సినిమా చేయనుంది. ఈ సినిమా పేరు ''నేనూ నా బాయ్‌ ఫ్రెండ్స్‌'' ఈ విషయం మనకు తెలిసిందే. ఇంతకీ ఆమె బాయ్‌ ఫ్రెండ్లు ఎవరు?

కుమారి 21 ఎఫ్‌ లో ఆమెనే బలాత్కారం చేసే నెగెటివ్‌ రోల్‌ లో నటించిన సింగర్‌ నోయల్‌ సీన్‌ ఉన్నాడు చూడండీ.. అతగాడు ఒక బాయ్‌ ఫ్రెండ్‌ గా ఫిక్సయ్యాడు. మరో బి.ఎఫ్‌.గా ఎవరంటే.. కేరింత సినిమాతో పాపులర్‌ అయిన పార్వతీశం ఉన్నాడు చూడండి.. అతగాడేనట. ఇంకో నటుడ్ని మూడో బాయ్‌ ఫ్రెండ్‌ గా తీసుకుంటారట. మొత్తానికి హెబ్బా తో రొమాన్స్‌ చేసే ఆ బాయ్‌ ఫ్రెండ్లు అలా ఫిక్సయిపోయారనమాట.

ప్రస్తుతం హెబ్బా మాత్రం ''ఈడోరకం ఆడోరకం'' సినిమా రిలీజ్‌ కోసం వెయిట్‌ చేస్తోంది.