Begin typing your search above and press return to search.
#బాక్సాఫీస్.. హోప్ పెంచుతున్న ఆ ఇద్దరు హీరోలు
By: Tupaki Desk | 20 Dec 2020 11:15 AM ISTఏపీ-తెలంగాణలో థియేటర్లు తెరిచేందుకు ప్రభుత్వాల సహకారం అందింది. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్..జగన్మోహన్ రెడ్డి వినోదపరిశ్రమకు వరాల జల్లు కురిపిస్తున్నారు. ఏపీ ప్రభుత్వం థియేటర్ల మనుగడ కోసం ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించింది. అంతా బాగానే ఉంది కానీ.. ఇప్పుడు థియేటర్లు తెరిచాక జనాల్ని పుల్ చేయడమెలా? అన్నదే చిక్కు ప్రశ్న. కరోనా వ్యాక్సినేషన్ వచ్చేసిందని చెబుతున్నా ఇంకా పూర్తి స్థాయిలో జనాలకు అందుబాటులోకి రాలేదు. ఒక రకంగా జనాల్లో భయం తగ్గడమే పాజిటివిటీని పెంచుతోందని చెప్పాలి.
ఇక ఇటీవల రిలీజైన సినిమాల్లో ఆంగ్ల చిత్రాలకు ఏ సెంటర్లలో ఆదరణ బావుంది. థియేటర్లలో టెనెట్ వంటి చిత్రాలను చూడటానికి A- సెంటర్ జనాలు ముందడుగు వేసినా.. సరైన సినిమాలు లేకపోవడం వల్ల బీ-సీ కేంద్రాల్లో ఇలాంటి అడుగు పడటం లేదు. హైదరాబాద్ వంటి మెట్రోలలో `వండర్ ఉమెన్ 1984` చిత్రానికి ముందస్తు బుకింగ్ లు చాలా బాగున్నాయి. ఈ మూవీ డిసెంబర్ 24న విడుదల కానుంది. అయితే ఇతర కేంద్రాల్లో సందడి లేదు. ఇలాంటప్పుడు సరైన సినిమా పడాల్సిన అవసరం స్పష్ఠంగా కనిపిస్తోంది. అందుకే ఈ కోవిడ్ -19 సీజన్లో బాక్సాఫీస్ ని పునరుద్ధరించడానికి సహాయపడే రెండు తెలుగు చిత్రాలపై హోప్ పెరుగుతోంది.
సాయి తేజ్ నటించిన `సోలో బ్రాతుకే సో బెటర్` డిసెంబర్ 25 న క్రిస్మస్ కానుకగా థియేటర్లలోకి రిలీజవుతోంది. మాస్ మహారాజా రవితేజ- శ్రుతి హాసన్ జంటగా నటించిన `క్రాక్` జనవరి 14 న థియేటర్లలోకి రిలీజ్ కానుంది. ఈ రెండు సినిమాలు క్లిక్కయి బాక్సాఫీస్ ని నిలబెడితే.. తిరిగి నూతనోత్సాహం వస్తుంది. ఇద్దరు హీరోలు తప్పకుండా తమకు ఒక మార్గం చూపిస్తారని పరిశ్రమ వర్గాలు ఆశిస్తున్నాయి. మరోవైపు సంక్రాంతి బరిలో ఇతర క్రేజీ చిత్రాలు రిలీజ్ కానున్నాయి. తమిళ అనువాదం మాస్టర్ కూడా రిలీజ్ బరిలో ఉంది. ఇవన్నీ ఆడితేనే తదుపరి రిలీజ్ చేయాలనుకునేవారికి ఊతం ఇచ్చినట్టవుతుంది. చిరంజీవి-బాలకృష్ణ- నాగార్జున- వెంకటేష్- ప్రభాస్ వంటి స్టార్లు నటించిన సినిమాలు బరిలో దిగితే మరింత ఊపొస్తుందనేది ఓ అంaచనా.