Begin typing your search above and press return to search.

లైగర్​ సినిమా కోసం విజయ్​కి బాక్సింగ్​ కోచింగ్​..!

By:  Tupaki Desk   |   14 March 2021 10:30 AM GMT
లైగర్​ సినిమా కోసం విజయ్​కి  బాక్సింగ్​ కోచింగ్​..!
X
పూరిజగన్నాథ్​ .. విజయ్​ దేవరకొండ కాంబినేషన్​లో ఓ భారీ ప్రాజెక్ట్​ సన్నద్ధమవుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాను పాన్​ ఇండియా స్థాయిలో తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు పూరి. బాలీవుడ్​కు యాప్ట్​ అయ్యే కథ కూడా ఉండటంతో ఈ చిత్ర నిర్మాణంలో కరణ్​ జోహార్​ కూడా భాగమయ్యారు. ఇదిలా ఉంటే ఈ సినిమా కోసం విజయ్​ కూడా భారీ అంచనాలు పెట్టుకొన్నాడు. ఈ సినిమా హిట్​ కొడితే .. బాలీవుడ్​ లో సైతం మార్కెట్ పెంచుకోవచ్చని విజయ్​ ఆరాటపడుతున్నాడు.

మరోవైపు ఇస్మార్ట్​ శంకర్​ హిట్​తో జోరుమీద ఉన్న పూరి జగన్నాథ్​.. మరో హిట్​ కొట్టాలని తహతహ లాడుతున్నాడు. దీంతో ఎంతో పట్టుదలతో లైగర్​ స్టోరీని సిద్ధం చేసినట్టు సమాచారం.

ఈ సినిమాలో విజయ్​ బాక్సింగ్​ ఫైటర్​గా కనిపించనున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం విజయ్​ దేవరకొండ ఓ కోచ్​ వద్ద బాక్సింగ్​ ఫైట్స్​ నేర్చుకున్నాడట.

​లైగర్​ సినిమా కోసం పూరి జగన్నాథ్​ ఓ భారీ బాక్సింగ్ సెట్​ను సిద్ధం చేశాడట. ఈ సెట్టింగ్​లో దాదాపు వారం రోజుల పాటు షూటింగ్​ జరగబోతున్నట్టు సమాచారం.

ఈ చిత్రాన్ని అన్ని బాలీవుడ్​తోపాటు అన్ని దక్షిణాది భాషల్లోనూ తెరకెక్కించబోతున్నారు.

పెళ్లి చూపులు, గీత గోవిందం, అర్జున్ రెడ్డి సినిమాలు విజయవంతంతో టాలీవుడ్ లో విజయ్ దేవరకొండ స్టార్డం సంపాదించాడు. అయితే బాలీవుడ్ లోనూ ఇలాంటి స్టార్డం సంపాదించాలని విజయ్ ఆశ పడుతున్నాడు. అందుకే పూరి కాంబినేషన్ లో పట్టుబట్టి మరీ లైగర్ సినిమాని హిందీలోనూ చేయిస్తున్నాడు. మామూలుగా దర్శకుడు పూరి జగన్నాథ్ ఏ సినిమాను అయినా నెలో, రెండు నెలల్లోనే తీసేస్తాడు. కానీ లైగర్ కోసం పూరి జగన్నాథ్ ఎప్పుడూ లేని విధంగా ఏడాదిగా సిద్ధమవుతున్నాడు. మరి పూరి జగన్నాథ్ విజయ్ దేవరకొండ బాలీవుడ్ ఆశను నెరవేర్చు తాడేమో వేచి చూడాలి.