Begin typing your search above and press return to search.
బాలయ్య vs రవితేజ.. బాక్సాఫీస్ వార్ తప్పదా..?
By: Tupaki Desk | 6 Oct 2021 2:00 PM ISTకరోనా సెకండ్ వేవ్ కారణంగా వాయిదా పడిన సినిమాలన్నీ విడుదల తేదీలను ప్రకటిస్తుండటంతో.. టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఆసక్తికరమైన పోటీ ఏర్పడుతోంది. ఇప్పటికే క్రిస్మస్ - సంక్రాంతి సీజన్స్ లో క్రేజీ మూవీస్ మధ్య క్లాష్ అనివార్యం అవుతోంది. ఈ క్రమంలో ఇప్పుడు దీపావళి పండక్కి నటసింహం నందమూరి బాలకృష్ణ - మాస్ మహారాజా రవితేజ పోటీపడే అవకాశాలు కనిపిస్తున్నాయి.
బాలయ్య నటిస్తున్న 'అఖండ' - రవితేజ హీరోగా చేస్తున్న 'ఖిలాడి' సినిమాలు ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధం అవుతున్నాయి. ఈ యాక్టన్ ఎంటర్టైనర్స్ లో ఇద్దరు హీరోలు ద్విపాత్రాభినయం చేస్తుండటం గమనార్హం. నిజానికి ఈ రెండు చిత్రాలను మే 28న రిలీజ్ చేయాలని మేకర్స్ నిర్ణయించుకున్నారు. కోవిడ్ వచ్చి రిలీజ్ ప్లాన్స్ కు అంతరాయం కలిగించింది. అయితే ఇప్పుడు, టాలీవుడ్ సర్కిల్స్ లో వినిపిస్తున్న టాక్ ప్రకారం 'అఖండ' మరియు 'ఖిలాడీ' చిత్రాలు మరోసారి బాక్సాఫీస్ వద్ద ఢీ కొట్టడానికి రెడీ అవుతున్నాయని తెలుస్తోంది.
దీపావళి పండుగ కానుకగా బాలకృష్ణ మరియు రవితేజ సినిమాలు నవంబర్ 4న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయట. ఇందులో నిజమెంతో తెలియాలంటే మేకర్స్ విడుదల తేదీలకు సంబంధించి అధికారిక ప్రకటన ఇచ్చే వరకు ఆగాల్సిందే. ఇకపోతే బాలయ్య - రవితేజ గతంలో నాలుగుసార్లు బాక్సాఫీస్ వద్ద పోటీ పడ్డారు. 2008 సంక్రాంతి సీజన్ లో 'కృష్ణ' - 'ఒక్కమగాడు' సినిమాలు ఒకేరోజు రిలీజ్ అయ్యాయి. ఆ తర్వాత 'మిత్రుడు' 'కిక్' సినిమాలు వారం గ్యాప్ లో బరిలో దిగాయి.
అలానే 'పరమవీర చక్ర' - 'మిరపకాయ్'.. 'వీర' - 'శ్రీరామరాజ్యం' సినిమాలు ఒకే సమయంలో ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. వీరిద్దరి మధ్య జరిగిన వార్ లో ఎక్కువసార్లు రవితేజ పైచేయి సాధించారని చెప్పవచ్చు. ఈ క్రమంలో ఇప్పుడు ఐదోసారి రవితేజ vs బాలయ్య పోటీ తప్పేలా లేదని టాక్ వినిపిస్తోంది. మరి రాబోయే రోజుల్లో ఏమి జరుగుతుందో చూడాలి.
కాగా, 'సింహా' 'లెజెండ్' వంటి సూపర్ హిట్స్ తర్వాత బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ చేస్తున్న సినిమా ''అఖండ''. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై మిర్యాల రవీందర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 'క్రాక్' వంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ తో జోష్ మీదున్న రవితేజ.. 'రాక్షసుడు' ఫేమ్ రమేష్ వర్మ దర్శకత్వంలో నటిస్తున్న సినిమా 'ఖిలాడి'. హావీష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై కోనేరు సత్యనారాయణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.