Begin typing your search above and press return to search.

టికెట్ కౌంటర్: నో బడీ కెన్ బీట్ హిమ్‌

By:  Tupaki Desk   |   12 July 2016 2:50 PM GMT
టికెట్ కౌంటర్: నో బడీ కెన్ బీట్ హిమ్‌
X
తెలుగు రాష్ట్రాల్లో ఈ వారాంతంలో టాప్ ఫైవ్ వసూళ్లు సాధించిన సినిమాల లిస్ట్ వచ్చేసింది. చెప్పుకోదగ్గ కొత్త తెలుగు సినిమాలు లేకపోవడం.. పాతవాటి హవా తగ్గడంతో.. ఈ వారం బాలీవుడ్ మూవీ సుల్తాన్ దున్నేస్తోంది.

1.సుల్తాన్: పోటీ అనే మాటే లేకపోవడంతో సుల్తాన్ అన్ని ఏరియాల్లో కుమ్మేస్తున్నాడు. ముఖ్యంగా నైజాం ఏరియాలో అయితే.. విపరీతంగా వసూళ్లు దక్కుతున్నాయి. తెలుగు రాష్ట్రాల నుంచి సుల్తాన్ పెద్ద మొత్తాన్నే పట్టుకెళ్లిపోతున్నాడు.

2.జెంటిల్మన్: నాని థ్రిల్లర్ మూవీకి మరో మంచి వీకెండ్ లభించింది. కొత్త సినిమాలు నిరుత్సాహపరచడంతో.. స్ట్రైట్ సినిమాలని అనుకునేవారికి జెంటిల్మన్ బెస్ట్ ఆప్షన్ అయింది. ప్రస్తుతం వచ్చిన వసూళ్ల ప్రకారం.. ఈగ - భలేభలే మగాడివోయ్ తర్వాత నాని బెస్ట్ మూవీ ఇదే.

3.బిచ్చగాడు: వీక్ డేస్ లో వసూళ్లు భారీగా లేకపోయినా వీకెండ్స్ లో మాత్రం చెప్పుకోదగ్గ మొత్తాలనే రాబడుతున్నాడు బిచ్చగాడు.

4. మేము: కోలీవుడ్ సూర్య హీరో ఉండడంతో.. వారాంతంలో మేము చిత్రానికి మంచి కలెక్షన్స్ వచ్చాయి. కంటెంట్ కూడా బాగుందనే టాక్ కారణంగా.. ఆడియన్స్ ఎట్రాక్ట్ అవుతున్నారు.

5.అంతం: రష్మీ గౌతమ్ ఒక్కటే ప్రధాన ఆకర్షణగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన అంతం ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో ఫెయిల్ అయింది. అయినా సరే కొంతమేర టార్గెట్ ఆడియన్స్ మాత్రం రష్మీ అందాల కోసం థియేటర్లకు రావడంతో టాప్ 5గా నిలిచింది.