Begin typing your search above and press return to search.

జాన్వీ-ఖుషీ ఇద్ద‌రు ఒకే బిజినెస్ మ్యాన్ తో డేటింగ్!

By:  Tupaki Desk   |   3 Nov 2022 2:30 AM GMT
జాన్వీ-ఖుషీ ఇద్ద‌రు ఒకే బిజినెస్ మ్యాన్ తో డేటింగ్!
X
బాలీవుడ్ సిస్ట‌ర్స్ జాన్వీక‌పూర్-కుషీ కపూర్ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. అక్కా-చెల్లి క‌న్నా మంచి స్నేహితులుగా మెలుగుతారు. స్నేహం లో పాలు-నీళ్ల‌లా క‌లిసిపోతారు. క‌లిసి పార్టీలు ఎంజాయ్ చేస్తారు. గుట్ టూ గెద‌ర్ ల‌కు హాజ‌ర‌వుతారు. వీకెండ్ పార్టీలు...మంతెండ్ పార్టీలంటూ ఎంజాయ్ చేయ‌డంలో వీరిద్ద‌రి త‌ర్వాతే అనిపిస్తారు.

ఇద్ద‌రి మధ్య వ్య‌త్యాసం అనేది ఏదైనా ఉంది అంటే? జాన్వీ న‌టిగా తెరంగేట్రం చేసింది...ఖుషీ ఇంకా కెమెరా ముందుకెళ్ల‌క‌పోవ‌డం ఉన్న తేడాగా క‌నిపిస్తుంది. మిగతా అన్ని విష‌యాల్లోనూ అక్క‌తో పోటీగా చెల్లెలు దిగిపోతుంది. ఇక జాన్వీ ఎఫైర్ల గురించైతే చెప్పాల్సిన ప‌ని లేదు. న‌టిగా ప‌రిచయం కాకముందు కొన్ని బ్రేక‌ప్ స్టోరీలున్నాయి.

అక్ష‌త్ రంజ‌న్... శిఖ‌ర్ ప‌హారియాల‌తో తెరంగేట్రానికి ముందు ఎఫైర్ సాగించింద‌ని వార్త‌లొచ్చాయి. ఆ త‌ర్వాత ఇషాన్ క‌ట్ట‌ర్ తోనూ కొన్నాళ్ల పాటు రిలేష‌న్ షిప్ కొన‌సాగించింది. ఇంకా ఈ లిస్ట్ లో అన్ నోన్ ప‌ర్స‌న్ కొంత మంది ఉన్నారు.

అయితే ఇలాంటి విష‌యాల్లో ఖుషీ కపూర్ పేరు పెద్ద‌గా బ‌య‌ట‌కు రాలేదు. బ‌య‌ట క‌నిపించ‌డం కూడా చాలా రేర్ కావ‌డంతో? డేటింగ్ వార్త‌ల్లో పెద్ద‌గా వైర‌ల్ కాలేదు.

అయితే అక్కా-చెల్లి ఇద్ద‌రు తాజాగా నెట్టింట సంచ‌ల‌నంగా మారారు. జాన్వీ-ఖుషీ ఒకే వ్య‌క్తితో డేటింగ్ చేస్తున్న‌ట్లు ఓ వార్త బాలీవుడ్ ని కుదిపేస్తోంది. ఇద్ద‌రు ఒక‌రికి తెలియ‌కుండా మ‌రొరు ఓ బిజినెస్ మ్యాన్ తో డేటింగ్ చేస్తున్న‌ట్లు వార్త‌లొస్తున్నాయి. ఆ బిజినెస్ మ్యాన్ కూడా ఒక‌ప్ప‌టి జాన్వీ మాజీ బోయ్ ప్రెండ్ గానే తెలుస్తోంది.

అత‌నే అక్ష‌త్ జైన్. జాన్వీ చిన్న నాటి ప్రెండ్..మాజీ ప్రియుడు. ఇప్పుడిత‌ను తోనే ఇద్ద‌రు జంట‌గా రొమాన్స్ చేస్తున్నట్లు ప్ర‌చారం సాగుతోంది. అక్కకి తెలియ‌కుండా చెల్లి....చెల్లి కి తెలియ‌కుండా అక్క‌ ర‌హ‌స్యంగా మీట్ అవుతున్న‌ట్లు బాలీవుడ్ గుస‌గుస‌లాడుకుంటోంది. జాన్వీ పాత ప‌రిచ‌యాన్ని మ‌ర్చిపోలేక మ‌ళ్లీ రిలేష‌న్ షిప్ లోకి దిగిన‌ట్లు ప్ర‌చారం సాగుతోంది. అయితే వీటిపై జాన్వీ స్పందించింది. ఇవ‌న్ని ప‌నిపాట లేని వారు సృష్టించే వేస్ట్ రూమార్స్ అంటూ కొట్టిపారేసింది. కానీ ఖుషీ మాత్రం ఇంకా స్పందించ‌లేదు. మ‌రి ఈ భామ ఏమంటుందో చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.