Begin typing your search above and press return to search.

బాస్ పార్టీ vs జై బాలయ్య.. పోటీ హీరోలదే కాదు..

By:  Tupaki Desk   |   21 Nov 2022 8:30 AM GMT
బాస్ పార్టీ vs జై బాలయ్య.. పోటీ హీరోలదే కాదు..
X
2023 సంక్రాంతికి బాక్సాఫీస్ వద్ద ఇద్దరు అగ్ర హీరోల మధ్య పోటీ నెలకొన్న విషయం తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి అలాగే నందమూరి బాలకృష్ణ నటించిన సినిమాలు భారీ స్థాయిలో విడుదలవుతున్నాయి. ఇక ఈ రెండు సినిమాలలో ఏ సినిమాకు ఎక్కువ హైప్ ఉంది అనే విషయం ఇప్పట్లో అయితే తేలేలా లేదు. ముందుగా వాల్తేరు వీరయ్య ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.

ఇక నందమూరి బాలకృష్ణ వీరసింహారెడ్డి పై కూడా అంచనాలు గట్టిగానే ఉన్నాయి. ఈ రెండు సినిమాలపై కూడా ఇరు వర్గాల అభిమానులలో ఎంతో ఆసక్తిని అయితే కలిగిస్తున్నాయి. మాస్ కమర్షియల్ అంశాలు హైలైట్ అయ్యేలా అలాగే యాక్షన్స్ సీన్స్ కూడా ఏమాత్రం తక్కువ కాకుండా ఈ సినిమాలో దర్శకులు పొందుపరిచారు. వాల్తేరు వీరయ్య దర్శకుడు బాబి అలాగే వీరసింహారెడ్డి దర్శకుడు గోపీచంద్ మలినేని కూడా ఎప్పటినుంచో మంచి స్నేహితులే.

ఇక వీరు మధ్య మొదటిసారి బాక్సాఫీస్ వద్ద పోటీ నెలకొంది. ఇక ఇది హీరో దర్శకుల మధ్యలో ఉన్న పోటీ మాత్రమే కాకుండా ఇప్పుడు టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్ గా కొనసాగుతున్న దేవిశ్రీప్రసాద్ తమను మధ్యలో కూడా ఒక తెలియని యుద్ధ వాతావరణాన్ని నెలకొల్పిందని కూడా చెప్పవచ్చు.

ఇప్పటికే వీరు అగ్ర దర్శకులను ఆకర్షించాలని ఎంతగానో ప్రయత్నం చేస్తున్నారు. ఒక విధంగా గత కొంతకాలంగా థమన్ ఎక్కువగా డామినేట్ చేస్తున్నాడు.

ఇక ఇప్పుడు థమన్ సంక్రాంతికి రాబోయే బాలయ్య సినిమాతో మరింత డామినేట్ చేసేందుకు రెడీ అయ్యాడు. అయితే మొదట మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమాలోని బాస్ పార్టీ అనే సాంగ్ రాబోతోంది. ఇక ఆ తర్వాత వీర సింహారెడ్డి సినిమాలోని జై బాలయ్య అనే మరో సరికొత్త వెర్షన్ సాంగ్ రాబోతోంది. ఈ రెండు పాటలలో ఏ పాట ఎక్కువ స్థాయిలో యువతను ఆకర్షిస్తుంది అనేది హాట్ టాపిక్ గా మారింది.

దేవిశ్రీప్రసాద్ కు థమన్ కు ఇది అసలైన పోటీ అని చెప్పవచ్చు. ఏదేమైనా కూడా మొదటి సాంగ్ మంచి క్రేజ్ అందుకుంటేనే సినిమాపై కూడా అంచనాలు పెరుగుతాయి. మరి వీరిద్దరిలో ఎవరు మోత మోగిస్తారో చూడాలి.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.