Begin typing your search above and press return to search.

‘జ్యోతిలక్ష్మీ’ మీద పుస్తకమట..

By:  Tupaki Desk   |   11 May 2016 4:31 AM GMT
‘జ్యోతిలక్ష్మీ’ మీద పుస్తకమట..
X
క్లాసిక్ లాగా నిలిచిపోయిన సినిమా గురించో.. బ్లాక్ బస్టర్ హిట్టయిన సినిమా సినిమా గురించో విశ్లేషిస్తూనో.. ఆ సినిమా తాలూకు అనుభవాలతోనో పుస్తకాలు తీసుకురావడం మామూలే. కానీ ఫ్లాప్ అయిన ఓ సినిమా మీద పుస్తకం రావడం మాత్రం తెలుగు సినిమా చరిత్రలో ఇదే తొలిసారి అయి ఉంటుందేమో. సరిగ్గా ఏడాది కిందట విడుదలైన పూరి జగన్నాథ్ ఫ్లాప్ సినిమా ‘జ్యోతిలక్ష్మీ’ మీద ఓ పుస్తకం తయారవడం విశేషం. ఓ రచయిత్రి వివిధ కోణాల్లో ఈ సినిమాను విశ్లేషించి.. వివిధ అంశాల్ని.. అనేక అభిప్రాయాల్ని క్రోడీకరించి ఈ పుస్తకం రాశారట. దీన్ని బుధవారమే ఆవిష్కరించబోతున్నట్లు సమాచారం.

‘జ్యోతిలక్ష్మీ’ దర్శకుడు పూరి జగన్నాథ్.. హీరోయిన్ ఛార్మితో పాటు ఆ సినిమా యూనిట్ సభ్యులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారట. ‘జ్యోతిలక్ష్మీ’ మెసేజ్ ఓరియెంటెడ్ సినిమానే కానీ.. దాన్ని పూరి ప్రెజెంట్ చేసిన తీరు జనాలకు నచ్చలేదు. పైపై మెరుగులు.. పబ్లిసిటీ జిమ్మిక్కులు తప్పితే సినిమాలో అంత కంటెంట్ కనిపించలేదు.

‘టెంపర్’ తర్వాత పూరి చేసిన సినిమా కావడం వల్ల.. విడుదలకు ముందు వచ్చిన హైప్ వల్ల ఓ మోస్తరుగా ఓపెనింగ్స్ తెచ్చుకుంది. పెద్దగా నష్టాలు మిగల్చకుండా బయటపడింది. ఐతే సినిమాకు నెగెటివ్ ఫీడ్ బ్యాకే వచ్చింది. విమర్శకులతో పాటు సామాన్య ప్రేక్షకులూ సినిమా చూసి పెదవి విరిచారు. ఇలాంటి సినిమా గురించి అంత లోతుగా రచయిత్రి ఏం విశ్లేషించారో చూడాలి మరి.