Begin typing your search above and press return to search.

థియేట‌ర్ య‌జ‌మానులదే పైచేయి..!

By:  Tupaki Desk   |   23 Feb 2022 4:34 AM GMT
థియేట‌ర్ య‌జ‌మానులదే పైచేయి..!
X
స‌రిగ్గా ఏదైనా పెద్ద సినిమా రిలీజ్ ముందు వివాదం మొద‌లైతే దానికి వ‌చ్చే పాపులారిటీ అంతా ఇంతా కాదు. ఓవైపు ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ న‌టించిన భీమ్లా నాయ‌క్ ఈనెల 25న అత్యంత ప్ర‌తిష్ఠాత్మ‌కంగా థియేట‌ర్ల‌లోకి వ‌స్తోంది. మ‌రోవైపు త‌మిళం నుంచి అజిత్ వ‌లీమై.. హిందీ నుంచి ఆలియా న‌టించిన గంగూభాయి క‌తియావాడీ ఈ సీజ‌న్ లోనే విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతున్నాయి.

ఇలాంటి స‌మ‌యంలో నైజాంలో బుక్ మై షోతో ఎగ్జిబిట‌ర్ల వివాదం ప‌రాకాష్ట‌కు చేరుకుంది. బుక్ మై షో ఆన్ లైన్ ప్రాసెసింగ్ ఫీజు .. ప‌న్నుల పేరుతో ప్రేక్ష‌కుల నుంచి భారీగా గుంజేస్తోంది. కానీ దానినుంచి న్యాయ‌బ‌ద్ధంగా చేరాల్సిన మొత్తం ఎగ్జిబిట‌ర్ కే చేర‌డం లేద‌నేది ఆరోప‌ణ‌. దీంతో బుక్ మై షోకు టికెట్ సేల్ అవ‌కాశాన్ని లేకుండా చేశారు ఎగ్జిబిట‌ర్లు. టికెట్ రేటు మీద 8 శాతాన్ని బుక్ మై షో వెనక్కు ఇవ్వాల్సి ఉండ‌గా.. ఇప్పుడు దానికి ఓకే చెప్పింద‌ట‌. అంటే వంద రేటు ఉన్న టికెట్ అమ్మితే రూ. 108 ఎగ్జిబిట‌ర్ కి వ‌స్తుంది.

200 ప్ల‌స్ ధ‌ర‌ టికెట్ అమ్మితే రూ.16 లు ఎగ్జిబిట‌ర్ ఖాతాలో అద‌నంగా యాడ‌వుతుంద‌న్న‌మాట‌. మొత్తానికి బుక్ మై షో దిగి రావ‌డం వ‌ల్ల ఎగ్జిబిట‌ర్ కి పెద్ద మొత్తంలో లాభం క‌లిసి రానుంది. మ‌ల్టీప్లెక్స్ టికెట్ తో ఏకంగా రూ. 21 వ‌ర‌కూ అద‌నంగా ఒక్కో టికెట్ కి ఎగ్జిబిట‌ర్ల‌కు క‌లిసి రానుంద‌ని స‌మాచారం. మాట్లాడుకుని సెటిల్ చేసుకున్నారు కాబ‌ట్టి ఇది భీమ్లా నాయ‌క్ తో పాటు ఇత‌రుల‌కు పెద్ద‌గా మేలు చేయ‌నుంద‌న్న‌మాట‌.