Begin typing your search above and press return to search.
ఫుట్ బాల్ నేపథ్యంలో నానితో బోనీ సినిమా
By: Tupaki Desk | 24 May 2021 8:00 AM ISTవరుసగా రీమేక్ చిత్రాలతో బాలీవుడ్ అగ్ర నిర్మాత బోనీకపూర్ సంచలనాలకు తెర తీస్తున్నారు. హిందీలో హిట్టయిన పింక్ చిత్రాన్ని తమిళం తెలుగులో రీమేక్ చేశారు. ఇటీవలే రిలీజైన వకీల్ సాబ్ (పింక్ రీమేక్) బాక్సాఫీస్ వద్ద చక్కని ఓపెనింగుల్ని తెచ్చింది.
మరోవైపు హిందీలో తెరకెక్కిస్తున్న మైదాన్ చిత్రాన్ని తెలుగులో నాని హీరోగా రీమేక్ చేయాలని బోనీ భావిస్తున్నారట. ఫుట్ బాల్ నేపథ్యంలో రాబోతున్న సినిమా కావడంలో నార్త్ లో ఈ సినిమా పై భారీగా అంచనాలు ఉన్నాయి. క్రికెట్ నేపథ్యంలో జెర్సీ సినిమా చేసిన నానీ ఈ మూవీపై ఆసక్తిగానే ఉన్నారట.
మరోవైపు మైదాన్ కోసం ఒకే సెట్ ని మూడు సార్లు నిర్మించాల్సి రావడం బోనీని కలవర పెడుతోందట. బోనీ కపూర్ కి వచ్చినంత కష్టం ఎవరికీ రాకూడదన్న టాక్ వినిపిస్తోంది. ఈ కరోనా లాక్ డౌన్ లో షూటింగ్ ఆలస్యమైంది. ఈలోగానే వర్షాల వల్ల సెట్ నాశనమైంది. తిరిగి మళ్లీ దానిని నిర్మిస్తున్నారు. ఒకసారి సినిమాకి ఓవర్ పెట్టుబడి పెడితేనే రిస్క్ చేసినట్లు... అలాంటిది ఒకే సెట్ ని బోణీ కపూర్ మూడు సార్లు వేయించడం హాట్ టాపిక్ గా మారింది.