Begin typing your search above and press return to search.

'వకీల్‌ సాబ్‌' సెట్‌ కు వచ్చిన కపూర్‌ సర్‌

By:  Tupaki Desk   |   9 Nov 2020 4:00 PM IST
వకీల్‌ సాబ్‌ సెట్‌ కు వచ్చిన కపూర్‌ సర్‌
X
పవన్‌ కళ్యాణ్‌ హీరోగా వేణు శ్రీరామ్‌ దర్శకత్వంలో రూపొందుతున్న వకీల్‌ సాబ్‌ సినిమాకు దిల్‌ రాజు తో పాటు బాలీవుడ్‌ నిర్మాత.. శ్రీదేవి భర్త అయిన బోణీ కపూర్‌ కూడా ఒక నిర్మాత అనే విషయం తెల్సిందే. బాలీవుడ్‌ మూవీ పింక్‌ రీమేక్‌ రైట్స్ ను తమిళం మరియు తెలుగుకు గాను బోణీ కపూర్‌ తీసుకున్నాడు. తమిళంలో సొంతంగానే రీమేక్‌ చేసిన బోణీ కపూర్‌ తెలుగులో మాత్రం దిల్‌ రాజుతో కలిసి నిర్మిస్తున్నాడు. ఈ సినిమా నిర్మాణ భాగస్వామ్యం అనే పేరు కాని బోణీ కపూర్‌ అస్సలు నిర్మాణ వ్యవహారాలు చూసుకోవడం లేదంటూ కామెంట్స్‌ వినిపిస్తున్నాయి. ఈ సమయంలో బోణీ కపూర్‌ హైదరాబాద్‌ కు వచ్చాడట.

హైదరాబాద్‌ లో కోర్టు సన్నివేశాల చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమా సెట్‌ లో బోణీ కపూర్‌ కొద్ది సమయం సందడి చేశారట. దర్శకుడు వేణు శ్రీరామ్‌ తో ముచ్చటించడంతో పాటు సినిమా క్వాలిటీ విషయమై తీస్తున్న విధానం గురించి అడిగి తెలుసుకోవడంతో పాటు ఇంకా ఎన్ని రోజులు షూటింగ్‌ బ్యాలన్స్‌ ఉందనే విషయంను కూడా యూనిట్‌ సభ్యులతో చర్చించారట. దర్శక నిర్మాతల టీం బోణీ కపూర్‌ కు సినిమా ప్రోగ్రెస్‌ ను వివరించారట.