Begin typing your search above and press return to search.

ఈ బంధం పెనుబంధం విడ‌దీయ‌రానిది!

By:  Tupaki Desk   |   13 Nov 2022 2:30 AM GMT
ఈ బంధం పెనుబంధం విడ‌దీయ‌రానిది!
X
అన్నా చెల్లెలు... అక్కా చెల్లెలు.. అన్నా త‌మ్ముడు ఇలా తోబుట్టువుల‌ అనుబంధాల‌తో భార‌తీయ కుటుంబ జీవ‌నం ఎప్ప‌టికీ గొప్ప ఆద‌ర్శంగా నిలుస్తుంది. అయితే ప్ర‌పంచీక‌ర‌ణ నేప‌థ్యంలో ఆర్థిక సంబంధాలు వీటిని చెడ‌గొట్టాయి. ఈరోజుల్లో ఉమ్మ‌డి కుటుంబ వ్య‌వ‌స్థ‌లు దెబ్బ‌తిని అనుబంధాలు నాశ‌నం అయ్యాయ‌ని సాంప్ర‌దాయ వాదులు త‌మ ఆవేద‌న‌ను వ్య‌క్తం చేస్తూనే ఉన్నారు.

కానీ ఈ సిస్ట‌ర్స్ న‌డుమ అనుబంధం గురించి తెలుసుకుంటే వారి అభిమానులు కూడా అలా ప్రేర‌ణ పొంద‌డం ఖాయం. ఇదంతా ఎవ‌రి గురించి అంటే.. క‌పూర్ సిస్ట‌ర్స్ జాన్వీ క‌పూర్- ఖుషీ క‌పూర్ గురించే. ఆ ఇద్ద‌రూ ఒక‌రిని విడిచి ఒక‌రు క్ష‌ణ‌మైనా గ‌డ‌ప‌లేరు. ఒక‌వేళ విద్యాభ్యాసం కోసమో ఇంకేదైనా ప‌ని మీద‌నో విదేశాల‌కు వెళ్లాల్సి వ‌స్తే క‌నీసం వారానికి ఒక‌సారి అయినా సోద‌రి కోసం విమాన‌మెక్కాల్సిందే. అంత‌గా ఆ ఇద్ద‌రి బంధం కొన‌సాగుతుంది. ఇది ఎంద‌రికో స్ఫూర్తి అని చెప్పాలి. ఈరోజుల్లో బిజీ లైఫ్ వ‌ల్ల‌ అనుబంధాలు అదృశ్య‌మ‌వుతున్నాయన్న ఆవేద‌న అలానే ఉంది. కానీ ప‌రిష్కారం క‌నిపించ‌డం లేదు.

దీనిని ఈ అక్కా చెల్లెళ్లు ఛేధిస్తున్నారు. తాజాగా తన చెల్లెలు ఖుషీ గురించి జాన్వీ క‌పూర్ మాట్లాడుతూ- ''చెల్లి అంటే నా ప్రాణం. త‌న‌ని అమితంగా ప్రేమిస్తున్నాను. నేను ఈక్వేషన్ ప‌రంగా పిచ్చిదానిని. నేను నా సోద‌రి అవసరంలో ఉన్నాను. నిద్రపోయే వరకు నాకు ఆమె కావాలి.

కునుకు ప‌ట్టేవ‌ర‌కూ నా గదిలో కూర్చోమని త‌న‌ను అడుగుతాను. ఒక‌వేళ‌ నాతో టైమ్ గడపక‌పోతే త‌న‌తో పోరాడతాను'' అని తెలిపింది. అంతేకాదు ఖుషీ చిన్నతనంలో దుస్తులు ధరించే విధానం త‌న‌కు న‌చ్చేది కాద‌ని కూడా జాన్వీ అంది. నేను ఎలా డ్రెస్సింగ్ చేస్తున్నానో చూడండి! అని త‌న గొప్ప‌ను కూడా చెప్పుకుంది.

అక్కా చెల్లెళ్ల అనుబంధం ఎంతో గొప్ప‌ది. ఇది విడ‌దీయ‌రాని పెనుబంధం. ఇంత‌కుముందు ఖుషీ విదేశాల్లో విద్యాభ్యాసం కోసం వెళ్లిన‌ప్పుడు వారం అయినా తిర‌క్కుండానే త‌న‌ను చూసేందుకు జాన్వీ క‌పూర్ విమాన‌యానం చేసింది. ఆ ఇద్ద‌రూ ఒక‌రికొక‌రు దూరంగా వెళ్లినా వ‌ర్చువ‌ల్ గా నిరంత‌రం ట‌చ్ లో ఉంటారు.

మ‌రోవైపు త‌న తండ్రి గారైన బోనీ క‌పూర్ తోను కుమార్తెలిరువురూ అంతే స‌న్నిహితంగా ప్రేమ‌గా ఉంటారు. పాపా బోనీతో క‌లిసి జాన్వీ ఇటీవ‌లే మిలీ అనే చిత్రంలో న‌టించింది. ఈ చిత్రానికి విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు ద‌క్కాయి. త‌దుప‌రి ఖుషీ తెరంగేట్రం కోసం జాన్వీ ఇప్ప‌టినుంచే త‌న‌కు ట్రైన‌ర్ గా మారింది. న‌ట‌న‌లో రాటు దేలేందుకు అవ‌స‌ర‌మ‌య్యే టిప్స్ ను అందిస్తోంది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.