Begin typing your search above and press return to search.

15ఏళ్లుగా బొమ్మ‌రిల్లు హాసినిని మ‌రువ‌నేలేదు!

By:  Tupaki Desk   |   20 Aug 2021 9:42 AM IST
15ఏళ్లుగా బొమ్మ‌రిల్లు హాసినిని మ‌రువ‌నేలేదు!
X
సిద్ధార్థ్ - జెనీలియా జంట‌గా న‌టించిన క్లాసిక్ హిట్ మూవీ `బొమ్మ‌రిల్లు` నేటితో 15 సంవ‌త్స‌రాలు పూర్తి చేసుకుంది. ఈ చిత్రానికి భాస్క‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన సంగ‌తి తెలిసిందే. 20 ఆగ‌స్టు 2006 న‌ విడుదలైన ఈ సినిమా మ్యూజిక‌ల్ బ్లాక్ బ‌స్ట‌ర్ గా నిలిచింది. యువ‌త‌రం స‌కుటుంబ స‌మేతంగా చూడ‌ద‌గ్గ గొప్ప చిత్రంగా మ‌న‌సుల్ని గెలుచుకుంది.

ఈ సినిమాతోనే భాస్క‌ర్ కాస్తా బొమ్మ‌రిల్లు భాస్క‌ర్ అయ్యాడు. అంత‌గా అత‌డికి పాపులారిటీ ద‌క్కింది. అలాగే జెనీలియాకు తెలుగు లోగిళ్ల‌లో అల్ల‌రి హాసినిగా గొప్ప ప్రేమ ఆద‌రాభిమానాలు ద‌క్కాయి. సిద్ధార్థ్ అద్బుత న‌ట‌న‌కు బొమ్మ‌రిల్లు కేరాఫ్ అడ్రెస్ గా నిలిచింది. ఒక కుటుంబం ఆ కుటుంబ పెద్ద క‌ట్టుబాట్లు అతి ప్రేమ ఫ‌లితంగా కంఫర్ట్ జోన్ క‌రువైన ఇత‌ర కుటుంబ స‌భ్యులు ఎలా విభిన్న భావోద్వేగాలకు గురవుతారో ఈ చిత్రంలో గొప్ప‌గా చూపించారు. గొప్ప క‌థ క‌థ‌నం న‌ట‌న ద‌ర్శ‌క‌త్వ ప్ర‌తిభ నిర్మాణ విలువ‌లు ఇప్ప‌టికీ హాట్ టాపిక్. ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మించిన సంగ‌తి తెలిసిందే. రాజు గారి సుదీర్ఘ‌ కెరీర్ లోనే మైలు రాయిగా నిలిచిన చిత్రంగానూ బొమ్మ‌రిల్లు రికార్డుల‌కెక్కింది. ఇక ఈ చిత్రంలో సునీల్ .. సుధ త‌దిత‌రుల న‌ట‌న‌కు మంచి పేరొచ్చింది.

సిద్ధార్థ్ - జెనీలియా స‌హా ప్రకాష్ రాజ్ బొమ్మరిల్లులో కీలక పాత్ర పోషించారు. విల‌క్ష‌ణ న‌టుడి పెర్ఫామెన్స్ కి గొప్ప గుర్తింపు ద‌క్కింది. తార‌ల‌ కెరీర్ లో అతిపెద్ద విజయాలలో ఒకటిగా నిలిచింది ఈ మూవీ. ఇప్పుడు వీరంతా త‌మ‌ జ్ఞాపకాల పున‌శ్చ‌ర‌ణ కోసం ఒక సమావేశాన్ని ప్లాన్ చేస్తున్నారు. ఇటీవల `బొమ్మరిల్లు` విడుదలై 15 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ప్రకాష్ రాజ్ ఈ చిత్రం గురించి దర్శకుడు భాస్కర్ మాట్లాడిన వీడియోను షేర్ చేసి #బొమ్మరిల్లు లో న‌టించి 15 సంవత్సరాలు గడిచిపోయాయి. జ్ఞాపకాలు ఇప్పటికీ చాలా ఫ్రెష్ గా ఉన్నాయి. మళ్లీ లైవ్ చేయడం అద్భుతంగా ఉంటుంది .. అని వ్యాఖ్యానించారు.

దీనికి సిద్ధార్థ్ - జెనీలియా స్పందిస్తూ తిరిగి కలవడానికి ప్లాన్ చేస్తున్నామ‌ని అన్నారు. మొత్తం మీరే చేశారు! ఏదో ఒకరోజు మనం భాస్కర్ డ్రీమ్ ప్రాజెక్ట్ #బొమ్మరిల్లు అద్భుతమైన విషయాలన్నింటినీ మనస్సుతో పంచుకుంటామని ఆశిస్తున్నాను.. అని సిద్ధార్థ్ వ్యాఖ్యానించారు. జెనీలియా కూడా త్వరగా చేద్దాం .. #బొమ్మరిల్లు ఎల్లప్పుడూ వేడుకగా ఉంటుంది అని సమాధానం చెప్పింది.

రితీష్ దేశ్ ముఖ్ తో వివాహం తర్వాత జెనీలియా ముంబై వెళ్లినప్పటి నుండి న‌ట‌న‌లో అంత‌ చురుకుగా లేరు. జెనీలియా చివరిగా 2012 చిత్రం `నా ఇష్టం` లో కనిపించింది. రానా దగ్గుబాటి స‌ర‌స‌న నాయిక‌గా నటించింది. సిద్ధార్థ్ కొన్నాళ్ల తర్వాత శర్వానంద్ తో కలిసి ద్విభాషా చిత్రం మహా సముద్రంతో టాలీవుడ్ లోకి పునరాగమనం చేస్తున్నాడు.