Begin typing your search above and press return to search.
షకలక శంకర్ 'బొమ్మ అదిరింది - దిమ్మ తిరిగింది' టీజర్..!
By: Tupaki Desk | 2 Dec 2020 11:33 AM ISTజబర్ధస్త్' కమెడియన్ షకలక శంకర్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న రొమాంటిక్ హారర్ కామెడీ ఎంటర్ టైనర్ "బొమ్మ అదిరింది - దిమ్మ తిరిగింది''. ఈ సినిమాతో కుమార్ కోట దర్శకునిగా ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నాడు. మహంకాళి మూవీస్ మహంకాళి దివాకర్ సమర్పణలో మణిదీప్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై మధు లుకాలపు - సోమేశ్ ముచర్ల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. టైటిల్ తోనే అటు మాస్ ఆడియెన్స్ లో ఇటు క్లాస్ అడియెన్స్ లో ఆసక్తి రేపిన ఈ చిత్ర ఫస్ట్ లుక్ కూడా విశేషంగా ఆకట్టుకుంది. ఈ క్రమంలో తాజాగా 'బొమ్మ అదిరింది - దిమ్మ తిరిగింది' టీజర్ ని చిత్ర యూనిట్ విడుదల చేసింది.
'బొమ్మ అదిరింది - దిమ్మ తిరిగింది' టీజర్ చూస్తుంటే ఇది కంప్లీట్ ఎంటరైనర్ గా తెరకెక్కించినట్లుగా తెలుస్తోంది. హారర్ అంశాలతో పాటు షకలక శంకర్ మార్క్ కామెడీ కూడా ఇందులో జోడించారు. కామెడీతో పాటు థ్రిల్ కి గురి చేసే సన్నివేశాలు కూడా ఈ చిత్రంలో ఉన్నాయని హింట్ ఇచ్చారు. దొంగ అయిన షకలక శంకర్ ఓ ఇంట్లోకి ప్రవేశించిన తర్వాత అక్కడ ఎదురైన సంఘటనల నేపథ్యంలో ఈ టీజర్ ఉంది. 'రాత్రి అది కొట్టిన దెబ్బలకు నాకు బొమ్మ అదిరిపోయి దిమ్మ తిరిగి పోయింది తెలుసా..' అంటూ షకలక శంకర్ చెప్పే డైలాగ్ అలరిస్తోంది.
ఇందులో షకలక శంకర్ తో పాటు ప్రియ - అర్జున్ కళ్యాణ్ - రాజ్ స్వరూప్ - మధు - స్వాతి - అవంతిక హీనా - రితిక చక్రవర్తి - సంజన చౌదరి తదితరులు కనిపిస్తున్నారు. దీనికి పిఆర్ సంగీతం అందించగా.. ఫణింద్ర వర్మ అల్లూరి కెమెరామెన్ గా వ్యవహరించారు. శివ శర్వాని ఎడిటింగ్ వర్క్ చేశారు. మొత్తం మీద హారర్ కామెడీ నేపథ్యంలో వచ్చిన 'బొమ్మ అదిరింది - దిమ్మ తిరిగింది' టీజర్ ఆడియన్స్ ని ఆకట్టుకునేలా ఉంది. ఈ చిత్రం త్వరలోనే థియేటర్స్ లో రాబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు.