Begin typing your search above and press return to search.

టీజర్: సైన్స్ ఫిక్షనల్ థ్రిల్లర్ గా 'బొంభాట్'..!

By:  Tupaki Desk   |   26 Nov 2020 10:30 PM IST
టీజర్: సైన్స్ ఫిక్షనల్ థ్రిల్లర్ గా బొంభాట్..!
X
ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్ అమెజాన్ ప్రైమ్ వీడియో వెబ్ సిరీస్ లతో పాటు కొత్త సినిమాలను డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ చేస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. ఇటీవలే 'ఆకాశం నీ హద్దురా' 'మిడిల్ క్లాస్ మెలోడీస్' చిత్రాలతో సత్తా చాటిన అమెజాన్.. మరో సినిమాని విడుదలకు సిద్ధం చేసింది. 'ఈ నగరానికి ఏమైంది' ఫేమ్ సుశాంత్ - సిమ్రాన్ చౌదరి మరియు 'కలర్ ఫోటో' ఫేమ్ చాందిని చౌదరి ప్రధాన పాత్రల్లో నటించిన ''బొంభాట్'' మూవీ త్వరలోనే స్ట్రీమింగ్ కానుంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ ని అమెజాన్ ప్రైమ్ విడుదల చేసింది.

'బొంభాట్' టీజర్ చూస్తుంటే ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు లవ్ బ్యాక్ డ్రాప్‌ తో సాగుతుందని అర్థం అవుతోంది. ప్రాజెక్ట్ బటర్ ఫ్లై అంటూ సినిమా నేపథ్యం దీని చుట్టూనే ఉంటుందనే హింట్ ఇచ్చారు. అలానే 'ఇక్కడ మనుషులకే లేవు ఫీలింగ్స్.. మెషీన్స్ కి ఎందుకు?' అనే డైలాగ్ తో సినిమాలో ఏదో కొత్త విషయం చెప్పబోతున్నారనే ఆసక్తి కలుగుతోంది. ఈ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ కు రాఘవేంద్ర వర్మ దర్శకత్వం వహించారు. ద‌ర్శ‌కేంద్రుడు కె.రాఘ‌వేంద్ర‌రావు స‌మ‌ర్ప‌ణ‌లో సుచేత డ్రీమ్ వర్క్స్ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌ పై విశ్వాస్ హన్నూర్కర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. టీజర్ తో ఇంట్రెస్ట్ ని కలిగించిన 'బొంభాట్' మూవీ డిసెంబర్ 3వ తేదీన అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదల చేయనున్నారు.